Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: సాంప్రదాయ పంటలకు చెక్ పెట్టి.. చెల్లెల సలహాతో పూల సాగుకు శ్రీకారం.. నెలకు లక్షన్నర ఆర్జిస్తున్న రైతు.. ఎక్కడంటే..

ఇంతకుముందు సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసే వాడినని అప్పుడు.. తనకు కనీసం  ఇంటి ఖర్చులు తీరడానికి సరిపడా ఆదాయం కూడా లభించలేదని గజానన్ చెప్పాడు. దీంతో అతని  కుటుంబం మొత్తం కూలి పని చేయడం ప్రారంభించారు. అప్పుడు గజానన్ సోదరి పువ్వులను పండిచామని సలహా ఇచ్చింది. పువ్వుల సాగుపై దృష్టి పెట్టిన గజానన్ మహోర్ పువ్వులా సాగుని నేర్చుకుని.. ఒకటిన్నర ఎకరాల్లో దేశీ గులాబీ, బంతి పువ్వుల సాగును ప్రారంభించాడు.

Success Story: సాంప్రదాయ పంటలకు చెక్ పెట్టి.. చెల్లెల సలహాతో పూల సాగుకు శ్రీకారం.. నెలకు లక్షన్నర ఆర్జిస్తున్న రైతు.. ఎక్కడంటే..
Flowers Farming
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2023 | 12:24 PM

మహారాష్ట్రలోని రైతులు సాంప్రదాయ పంటలను మాత్రమే సాగు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఓ రైతు మాత్రం సాంప్రదాయ వ్యవసాయానికి గుడ్ బై చెప్పి.. ఆధునిక పద్ధతిలో పూల సాగు చేస్తున్నాడు. దీంతో రైతుల ఆదాయం పెరిగింది. ఆ రైతు పేరు గజానన్ మహోర్. పూలమొక్కలను పెంచుతూ లాభాలను ఆర్జిస్తూ ఇప్పుడు తన గ్రామంలోని స్థానికులకు ఆదర్శంగా నిలిచాడు. గజాననుడు. అయితే ఈ రైతు తన సోదరి కోరిక మేరకు బంతిపూలు, గులాబీ పూల సాగుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు ఏడాదికి లక్షల రూపాయలను ఆర్జిస్తున్నాడు.

కిసాన్ తక్ నివేదిక ప్రకారం.. రైతు గజానన్ మహోర్ హింగోలి జిల్లాలోని డిగ్రాస్ గ్రామ నివాసి. 6 ఎకరాల భూమిలో వివిధ రకాల పూల సాగు చేస్తున్నాడు. పువ్వుల సాగుతో ప్రతినెలా సుమారు లక్షన్నర ఆదాయాన్ని అర్జిసున్నాడు. ఇంతకుముందు సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసే వాడినని అప్పుడు.. తనకు కనీసం  ఇంటి ఖర్చులు తీరడానికి సరిపడా ఆదాయం కూడా లభించలేదని గజానన్ చెప్పాడు. దీంతో అతని  కుటుంబం మొత్తం కూలి పని చేయడం ప్రారంభించారు. అప్పుడు గజానన్ సోదరి పువ్వులను పండిచామని సలహా ఇచ్చింది. పువ్వుల సాగుపై దృష్టి పెట్టిన గజానన్ మహోర్ పువ్వులా సాగుని నేర్చుకుని.. ఒకటిన్నర ఎకరాల్లో దేశీ గులాబీ, బంతి పువ్వుల సాగును ప్రారంభించాడు. దీంతో సంపాదన ప్రారంభమైంది. దీని తర్వాత గజానన్ మరో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.

రైతు గజానన్ మాహోర్ 6 ఎకరాల్లో పూల సాగు చేశాడు

ఇవి కూడా చదవండి

హింగోలిలో ఎనిమిదవ జ్యోతిర్లింగం క్షేత్రం ఉంది. దీంతో ఇక్కడకు దేశం నలుమూలల నుండి మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. సమీపంలోని నాందేడ్‌లో సిక్కుల మందిరం ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో పువ్వులకు గిరాకీ ఎక్కువ. దీంతో తాను పండిస్తున్న పువ్వులను, పువ్వుల దండలను అమ్ముతున్నారు. శ్రమకు తగిన ఫలితం దక్కింది లాభాలను అందుకున్నాడు.

విశేషమేమిటంటే గజానన్ పండిస్తున్న పువ్వులకు డిమాండ్ పెరిగింది. దీంతో తాను సాగు చేస్తున్న భూమి విస్తీర్ణం కూడా పెంచాడు. ప్రస్తుతం తనకున్న మూడెకరాల భూమికి మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పూల సాగు చేస్తున్నాడు. గులాబీ, లిల్లీ,  బంతిపూలతో సహా 10 రకాల పూలను సాగు చేస్తున్నాడు. ఇప్పుడు గజానన్‌కు ప్రతినెలా రూ.1.5 లక్షల ఆదాయం వస్తోంది.

మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా పూలను సాగుచేస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. డ్రిప్ ఇరిగేషన్  ద్వారా మొక్కలకు నీరందించడం వల్ల నీరు కూడా ఆదా అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలంటే పూల సాగుని ఎంపిక చేసుకోమని ఇతర రైతులకు చెబుతున్నాడు గజానన్.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..