Pink Garlic: త్వరలో పింక్ వెల్లుల్లి సాగు.. దీని ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..

వెల్లుల్లి అంటే తెలుపు రంగులో ఉంటుంది అని అందరికీ తెలుసు.. కొంతమందికి నల్ల వెల్లుల్లి గురించి కూడా తెలుసు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు గులాబీ రంగు వెల్లుల్లిని ఆవిష్కరించారు. అతి త్వరలో గులాబీ వెల్లుల్లిని రుచి చూడగలరు . బీహార్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ వెల్లుల్లిలో కొత్త మెరుగైన రకమైన గులాబీ వెల్లుల్లిని అభివృద్ధి చేసింది.

Pink Garlic: త్వరలో పింక్ వెల్లుల్లి సాగు.. దీని ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..
Pink Garlic Farming
Follow us

|

Updated on: May 29, 2023 | 12:21 PM

వెల్లుల్లి ఓ వంటింటి ఔషధం. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. భాస్వరం , మాంగనీస్, జింక్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి6 , ఐరన్ వెల్లుల్లిలో పుష్కలంగా లభిస్తాయి . అంతేకాదు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పాంతోతేనిక్ యాసిడ్ , థయామిన్ కూడా ఇందులో ఉంటాయి. ఔషధ గుణాలు కలిగిన ఈ వెల్లుల్లిని భారతదేశం అంతటా పండిస్తారు. అయితే వెల్లుల్లి అంటే తెలుపు రంగులో ఉంటుంది అని అందరికీ తెలుసు.. కొంతమందికి నల్ల వెల్లుల్లి గురించి కూడా తెలుసు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు గులాబీ రంగు వెల్లుల్లిని ఆవిష్కరించారు. అతి త్వరలో గులాబీ వెల్లుల్లిని రుచి చూడగలరు . బీహార్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ వెల్లుల్లిలో కొత్త మెరుగైన రకమైన గులాబీ వెల్లుల్లిని అభివృద్ధి చేసింది.

న్యూస్ 18 హిందీ నివేదిక ప్రకారం.. ఈ  పింక్ వెల్లుల్లి ఉత్పత్తి సామర్థ్యం సాంప్రదాయ వెల్లుల్లి కంటే కూడా ఎక్కువ. అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఈ కొత్త రకం వెల్లుల్లిలో సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం చాలా ఎక్కువ. అంతేకాదు గులాబీ వెల్లుల్లి నిల్వ సామర్థ్యం తెల్ల వెల్లుల్లి కంటే చాలా ఎక్కువ.  ఎంత కాలమైనా సరే  మీరు ఇంటి లోపల ఈ గులాబీ వెల్లుల్లిని నిల్వ చేసుకోవచ్చు. పోషకాహారం, పొటాషియం కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. అందువలన త్వరగా ఈ గులాబీ వెల్లుల్లి పాడవదు.

గులాబీ వెల్లుల్లి త్వరగా చెడిపోదు

ఇవి కూడా చదవండి

ఈ కొత్త రకం వెల్లుల్లిపై దాదాపు 9 ఏళ్లుగా పనిచేస్తున్నామని పరిశోధనా బృందం ప్రధాన శాస్త్రవేత్త సంగీత శ్రీ తెలిపారు. కష్టపడి ఎట్టకేలకు విజయం సాధించినట్లు పేర్కొన్నారు. లేత గులాబీ రంగు వెల్లుల్లిని తమ  బృందం అభివృద్ధి చేసింది. పింక్ వెల్లుల్లి తొక్కలు తెలుపు కంటే చాలా మందాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. కనుక గులాబీ రంగు వెల్లుల్లి త్వరగా చెడిపోదు.

గులాబీ వెల్లుల్లిని సాగు చేయనున్న రైతులు 

ఈ కొత్త రకం వెల్లుల్లికి సంబంధించి బీహార్ ప్రభుత్వంతో తమ శాస్త్రవేత్తల బృందం చర్చలు జరిపిందని శాస్త్రవేత్త సంగీత శ్రీ తెలిపారు. బీహార్ ప్రభుత్వం కూడా పింక్ వెల్లుల్లి సాగు పై ఆసక్తి చూపింది. త్వరలో ఈ రకం సాగు మార్కెట్‌లోకి రానుంది. మరికొంత కాలంలో రైతు సోదరులు గులాబీ వెల్లుల్లిని పండించవచ్చు. రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ వెల్లుల్లి ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తామని అన్నారు. విశేషమేమిటంటే బీహార్ ప్రభుత్వం గులాబీ వెల్లుల్లిని విడుదల చేయనుంది.

తెల్ల వెల్లుల్లి కంటే గులాబీ వెల్లుల్లికి వ్యాధి నిరోధకత రెట్టింపు ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే కొత్త రకం గులాబీ వెల్లుల్లిలో సల్ఫర్ , ఫాస్పరస్ పరీక్ష జరిగింది. గులాబీ రంగు వెల్లుల్లి మొక్కలకు రోగాలు దరిచేరవని చెబుతున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..