Earthworm Farming: వానపాముల పెంపకంతో నెలకు అర లక్ష.. ఎలా పెంచాలి, ఎలా వ్యాపారం ప్రారంభించాలంటే..

మొట్టమొదట విదేశాల్లో వానపాముల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించారు. 1970 లలో, వానపాములను ఐరోపా, అమెరికాలో చేపల ఆహారంగా ఉపయోగించడం ప్రారంభించారు. దీని కారణంగా వానపాముల పెంపకం వ్యాపారం అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడు భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

Earthworm Farming: వానపాముల పెంపకంతో నెలకు అర లక్ష.. ఎలా పెంచాలి, ఎలా వ్యాపారం ప్రారంభించాలంటే..
Earthworm Farming
Follow us

|

Updated on: May 26, 2023 | 10:20 AM

రసాయనిక ఎరువులు , క్రిమిసంహారక మందుల వాడకం వల్ల భూమి సారం క్రమేపీ తగ్గుతూ పోస్తోంది. భూమిలో పంటలు పండించే శక్తి బలహీనపడుతోంది. ముఖ్యంగా రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడడం వల్ల నేలలో సహజంగా ఉండే వానపాములు, ఇతర పోషకాల బాక్టీరియా అంతరించిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడి కూడా దెబ్బతింటోంది. అయితే ఇప్పుడు రైతులు సహజమైన పద్ధతుల్లో పంటలను పండించే దిశగా మళ్ళీ అడుగులు వేస్తున్నారు. సహజమైన పేడ, కంపోస్ట్ ఎరువులతో పాటు..  ఇప్పుడు రైతులు వానపాములను కొనుగోలు చేసి తమ పొలాల్లో వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భూమి సహజంగానే పూర్వంలా సారవంతమై పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. దీంతో ఇప్పుడు అంతరించి పోతున్న వానపాముల వ్యవసాయం చేస్తున్నారు. వానపాముల పెంపకంతో రైతులు బాగానే సంపాదిస్తున్నారు. ఈ రోజు వానపాముల పెంపకం గురించి తెలుసుకుందాం.

వాస్తవానికి, వానపాము నేల భూసారాన్ని పెంచుతుంది. వానపాములు పొలంలో పంటలకు సేంద్రియ ఎరువుగా పనిచేస్తాయి. వానపాము భూమిలోపల పైకి క్రిందికి కదులుతూ ఉంటుంది. దీని కారణంగా మట్టిలో  రంధ్రాలు ఏర్పడతాయి. దీని కారణంగా గాలి, వర్షం నీరు భూమిలోపలికి వెళ్తాయి. లేదా మట్టికి నీటిని లోపలి ఇంకే శక్తి పెరుగుతుంది. అందుకే వానపాములను అన్నదాతకు స్నేహితుడు అని పిలుస్తారు.

వానపాముల పెంపకం ఎలా  చేపట్టాలంటే..

ఇవి కూడా చదవండి

వానపాముల పెంపకం చాలా సులభమైన పని. వర్మీ కంపోస్టు తయారు చేసే విధానాన్ని వానపాముల పెంపకం అంటారు. మొట్టమొదట విదేశాల్లో వానపాముల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించారు. 1970 లలో, వానపాములను ఐరోపా, అమెరికాలో చేపల ఆహారంగా ఉపయోగించడం ప్రారంభించారు. దీని కారణంగా వానపాముల పెంపకం వ్యాపారం అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడు భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. బీహార్‌లో ప్రభుత్వం ఆర్గానిక్ ఫార్మింగ్ కారిడార్‌ను రూపొందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వానపాములకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు భారతదేశంలో వానపాముల పెంపకం వ్యాపార రూపం దాల్చడానికి కారణం ఇదే. ఇందుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా ఇస్తోంది.

ఎలాంటి వాతావరణంలో పెంచాలంటే..

ఎవరైనా వానపాముల పెంపకం ప్రారంభించాలనుకుంటే.. ముందుగా సూర్యరశ్మికి తక్కువ ఉండి.. నీడ ఉన్న స్థలాన్ని ఎంచుకోండి. ఆ స్థలంలో పెద్ద దీర్ఘచతురస్రాకార గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిలో ఆవు పేడ, మట్టి, కుళ్లిన ఆకులు, కూరగాయలు, పండ్ల తొక్కలను కలపండి. తర్వాత ఆ గుంతలో 50-60 ఎపిజిక్, అనిసిక్ తరగతి వానపాములను వేసి గడ్డితో కప్పాలి. మధ్యమధ్యలో నీళ్లు చల్లుతూ ఉండండి. మూడు నాలుగు వారాల తర్వాత వర్మీ కంపోస్టులో వానపాముల సంఖ్య వెయ్యికి పైగా పెరగడం మీరు చూస్తారు. దీని తరువాత మీరు వీటిని మార్కెట్లో విక్రయించవచ్చు. మంచి ఆదాయాన్ని ఇస్తుంది.

50 వేలకు పైగా సంపాదన ఉంటుంది

ప్రస్తుతం మార్కెట్‌లో 600 వానపాముల ధర 5 వేల రూపాయలు. 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వానపాముల పెంపకం ప్రారంభిస్తే దాదాపు 8 వేల వానపాములను పొందవచ్చు. ఈ విధంగా 8 వేల వానపాములను విక్రయించి 50 వేలకు పైగా సంపాదించవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..