Constipation: ఎక్కువ నీరు తాగితే మలబద్ధకం సమస్య వస్తుందా.. ఇందులో నిజమెంత..?
మన శరీరం 70 శాతం నీటితో నిర్మితమైందని మనందరికీ తెలుసు. కానీ ఎంత మోతాదు నీరు తీసుకోవాలాన్న దానిపై చాలా మందిలో సందేహాలున్నాయి. ఎక్కువ నీరు తీసుకుంటే మలబద్ధకం వస్తుందని కూడా కొందరు అపోహకు గురవుతుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదని.. ఎక్కువ నీరు తాగితే మలబద్ధకం వస్తుందన్న ప్రచారంలో
మన శరీరం 70 శాతం నీటితో నిర్మితమైందని మనందరికీ తెలుసు. కానీ ఎంత మోతాదు నీరు తీసుకోవాలాన్న దానిపై చాలా మందిలో సందేహాలున్నాయి. ఎక్కువ నీరు తీసుకుంటే మలబద్ధకం వస్తుందని కూడా కొందరు అపోహకు గురవుతుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదని.. ఎక్కువ నీరు తాగితే మలబద్ధకం వస్తుందన్న ప్రచారంలో నిజం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే తక్కువ నీరు తాగడం ద్వారా మలబద్ధకం వస్తుందని చెబుతున్నారు. మన శరీరంలో నీటి స్థాయిని మెయింటైన్ చేసేందుకు మనం రోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో నీటి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైన మోతాదు కంటే.. తక్కువ మోతాదులో నీరు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి.
- మలబద్ధకం: అవును, మీరు రోజంతా తక్కువ నీరు తాగితే, మీకు మలబద్ధకం సమస్య రావొచ్చు. ఎందుకంటే నీరు మన ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు తక్కువ నీరు తాగినప్పుడు, ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అందుకే తక్కువ నీరు తాగడం బలద్ధకం సమస్యకు కారణమవుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే ఎక్కువ నీరు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
- యూరిన్ ఇన్ఫెక్షన్: తక్కువ నీరు తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే నీరు తాగడం వల్ల మూత్రం ఎక్కువగా పోతుంది. మీ శరీరంలోని మలినాలు బయటకు పోతాయి, కానీ మీరు తక్కువ నీరు తాగినప్పుడు, మీరు ఎక్కువగా మూత్రం చేసే అవకాశముండదు. దీంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.
- మూత్రపిండాల సమస్యలు: నీరు మన శరీరం నుండి మలినాలను తొలగించడానికి పనిచేస్తుంది. మనం తగినంత నీరు తాగనప్పుడు మూత్రపిండాల పనితీరులో సమస్యలు తలెత్తుతాయి. ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
- చర్మ సమస్యలు: మీ చర్మం పొడిగా, నిర్జీవంగా ఎండిపోయినట్లుగా కనిపిస్తుంటే.. దానికి తక్కువ నీరు తాగడం కారణం కావొచ్చు. నీరు మీ చర్మంపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి అవసరమైన మోతాదులో నీరు తాగాలి. తద్వారా మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. అలాగే చర్మంపై ముడతలు, వృద్ధాప్య సంకేతాలు దానిపై కనిపించవు.
- మెదడు పనితీరును బలహీనపరుస్తాయి: తగినంత నీరు తాగనివారిలో ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయని, వారి మెదడు చురుగ్గా పనిచేయదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ నీరు తాగడం మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం, తలనొప్పి సమస్యలను కూడా కలిగిస్తుంది.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం సమస్యపై పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే. మీకు సంబంధిత ఆరోగ్య సమస్య ఉంటే నేరుగా వైద్యుడిని సంప్రదించాలి)