Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rasbhari Farming: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనుకుంటున్నారా.. విదేశీ పండు రాస్భరి సాగు బెస్ట్ ఎంపిక..

విదేశాల నుంచి మనదేశంలో అడుగు పెట్టిన పండులో ఒకటి రాస్భరి. వాస్తవానికి ఈ పండు దక్షిణ అమెరికాకు చెందినది. అయితే ఇప్పుడు ఈ పండుని భారతదేశంలో పండిస్తున్నారు. తక్కువ ఖర్చుతో రాస్భరిని పండిస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు. రైతులు. 

Rasbhari Farming: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనుకుంటున్నారా.. విదేశీ పండు రాస్భరి సాగు బెస్ట్ ఎంపిక..
Rasbhari Farming
Follow us
Surya Kala

|

Updated on: May 09, 2023 | 11:34 AM

భారతదేశంలో విభిన్న వాతావరణం.. రకరకాల నేలలు ఉంటాయి. దీంతో దేశీయ పండ్లు, కూరగాయలు మాత్రమే కాదు.. విదేశీ కూరగాయలు, పండ్ల సాగు కూడా సులభంగా చేస్తున్నారు. అది స్ట్రాబెర్రీ అయినా బ్రోకలీ అయినా మన దేశంలో సాగు చేసి లాభాల బాట పడుతున్నారు. తాజాగా విదేశాల నుంచి మనదేశంలో అడుగు పెట్టిన పండులో ఒకటి రాస్భరి. వాస్తవానికి ఈ పండు దక్షిణ అమెరికాకు చెందినది. అయితే ఇప్పుడు ఈ పండుని భారతదేశంలో పండిస్తున్నారు. తక్కువ ఖర్చుతో రాస్భరిని పండిస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు. రైతులు.

20 నుండి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ రాస్భరి పంట సాగుకు మంచిదిగా పరిగణించబడుతుంది. అయితే ఈ పంటను 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా సాగు చేయవచ్చు. దాని మొక్క ఫలాలను ఇవ్వడం ప్రారంభించిన తర్వాత, అది 3 నెలల పాటు సమృద్ధిగా ఫలాలను ఇస్తుంది. రెండు బిగాల భూమిని సాగు చేసిన తర్వాత పంట చేతికి రావడం మొదలు పెడితే..  ఒక సంవత్సరంలో 2 నుండి 3 లక్షల రూపాయల వరకు అన్నదాత లాభాలను పొందుతారు.

  1. రాస్భరి సాగు కోసం గుర్తుంచుకోవలసిన విషయాలు మీరు రాస్భరి వ్యవసాయం చేయాలనుకుంటే.. కొన్ని విషయాలను చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దీంతో రాస్భరి సాగుకి తక్కువ ఖర్చు అవుతుంది. నష్టాలు కలగకుండా లాభాలను పొందవచ్చు,
  2. రాస్భరిని ఏ రకమైన మట్టిలోనైనా సాగు చేయవచ్చు. అయితే ఇసుక నేల ఉత్తమం.
  3. ఇవి కూడా చదవండి
  4. రాస్భరి సాగు చేయాలంటే పొలంలో నీటి పారుదల నిర్వహణకు తగిన విధంగా నిర్వహించాలి. పొలంలో ఎక్కువ నీరు ఉంటే, దాని మొక్క యొక్క వేర్లు కుళ్ళిపోవచ్చు.
  5. రాస్భరి మొలకలని నేల నుండి 20 నుండి 25 సెంటీమీటర్ల ఎత్తులో నాటతారు. ఇలా చేయడం వలన మొక్కలు నీటిలో ఎక్కువ కాలం ఉండకుండా కాపాడుతుంది.
  6. రాస్ప్బెర్రీ మొక్కలు ప్రతి సంవత్సరం జూలై నెలలో నాటుకోవాలి, ఆ తర్వాత అవి జనవరిలో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి మరియు 3 నెలల పాటు నిరంతరం పండ్లు ఇస్తాయి.
  7. రాస్ప్బెర్రీ సాగులో కలుపు సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది.  ఈ మొక్కలో కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. కనుక మూడు నాలుగు సార్లు కలుపు తీయాలి. అంతేకాదు పొలానికి 3 నుండి 4 సార్లు నీరు పెట్టాలి.
  8. రాస్ప్బెర్రీ సాగుకు సాధారణ ఆవు పేడ ఎరువు కూడా పనిచేస్తుంది. ఇది కాకుండా, కంపోస్ట్ ఎరువును కూడా ఉపయోగించవచ్చు. నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఎరువులు మంచి పంటకు ఉపయోగించవచ్చు.
  9. ఒక హెక్టారు విస్తీర్ణంలో మేడిపండు సాగుకు 200 నుంచి 250 గ్రాముల విత్తనాలు మాత్రమే సరిపోతాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో దీని విత్తనాలు చాలా రకాలు లభ్యమవుతాయి. ప్రస్తుతం రాస్ప్బెర్రీ విత్తనాలను ఆన్‌లైన్‌లో కూడా లభ్యమవుతున్నాయి.

మరిన్నిహ్యుమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..