Brahmamudi: ఆసక్తి కథతో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న బ్రహ్మముడి.. దారుణమైన కథతో ప్రేక్షకాదరణ కోల్పోతున్న గృహలక్ష్మి ..

అయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ రోజు రోజుకీ చాలా దారుణంగా పడిపోయింది. ఇంటికి దీపం ఇల్లాలు, జానకి కలగనలేదు, వంటలక్క, మధురానగరి కంటే అతి తక్కువ రేటింగ్ ను దక్కించుకుంది. 

Brahmamudi: ఆసక్తి కథతో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న బ్రహ్మముడి.. దారుణమైన కథతో ప్రేక్షకాదరణ కోల్పోతున్న గృహలక్ష్మి ..
Trp Ratings
Follow us
Surya Kala

|

Updated on: May 09, 2023 | 12:06 PM

ఏ భాషలోనైనా, సిల్వర్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకోవాలంటే కావాల్సింది భిన్నమైన కథ, కథనం. తెలుగులో బుల్లితెరపై స్టార్ మా సీరియల్స్ సత్తాను చాటుతూ.. ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. స్టార్ మా సీరియల్స్ లో ఫస్ట్ ప్లేస్ నుంచి టాప్ 5 వరకూ అన్నీ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్సే ఉండడం విశేషం. అయితే ఈ సారి టాప్ ఫైవ్ లో నాగపంచమి చేరింది. టీఆర్పీ రేటింట్ లో ఫస్ట్ ప్లస్ లో బ్రహ్మముడి 2.75 రేటింగ్‌తో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో 11.36 రేటింగ్‌తో కృష్ణా ముకుందా మురారి.. 11.31 రేటింగ్‌తో కొత్త సీరియల్ నాగపంచమి మూడో స్థానంలో నిలిచింది.  గుప్పెడంత మనసు 10.31 రేటింగ్‌తో నాలుగో స్థానానికి పడిపోగా.. 8.37 రేటింగ్‌తో మల్లి సీరియల్ ఐదో స్థానంలో నిలిచింది.

అయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ రోజు రోజుకీ చాలా దారుణంగా పడిపోయింది. ఇంటికి దీపం ఇల్లాలు, జానకి కలగనలేదు, వంటలక్క, మధురానగరి కంటే అతి తక్కువ రేటింగ్ ను దక్కించుకుంది.

వాస్తవానికి కార్తీక దీపం సీరియల్ తర్వాత ఆ రేంజ్ లో బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది గుప్పెడంత మనసు సీరియల్.. టాప్ రేస్ లో కొంత కాలం దూసుకుపోయింది. అయితే బ్రహ్మముడి సీరియల్ ప్రసారం అవుతున్న తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ దాటి బుల్లితెర ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని టాప్ రేసులో దూసుకుపోతోంది. బ్రహ్మముడి దెబ్బకి గుప్పెడంత మనసు సీరియల్.. రెండో స్థానానికి పడిపోయి.. ఇప్పుడు నిలకడలేని కథ కథనంతో మూడు, ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది.

ఇవి కూడా చదవండి

అయితే టాప్ టాప్ సీరియల్స్ లో ఒకటిగా ఉండే గృహలక్ష్మి రేటింగ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రసారం అయినప్పటి నుంచి ఇంతటి దారుణమైన రెటింగ్ ఎప్పుడూ రాలేదు. 4.91 రేటింగ్ తో దారుణంగా పడిపోయింది. రొటీన్ కథ, కథనంతో బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణను కోల్పోయింది గృహలక్ష్మి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..