- Telugu News Photo Gallery Cinema photos Met gala 2023 stars seen in unique outfits princesses and animal looks on the red carpet
Met Gala 2023: జంతువుల రూపాల్లో కార్పెట్‌పై మెరిసిన నక్షత్రాలు.. ఫ్యాషన్ నైట్‌లో సందడి
మెట్ గాలా 2023లో చాలా గ్లామర్ కనిపించింది. ఈ ఫ్యాషన్ నైట్‌లో భారతదేశం, విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మెట్ గాలాలో ఒకటి కంటే ఎక్కువ ఫ్యాషన్ దుస్తులు కనిపిస్తూ కనువిందు చేస్తాయి. మీరు కూడా ఫ్యాషన్ ప్రేమికులైతే ఈ రోజు మెటా గలాలో ప్రదర్శించిన అత్యంత ప్రత్యేకమైన దుస్తులను మీ కోసం తీసుకువచ్చాము.
Updated on: May 02, 2023 | 12:06 PM

రాపర్ డోజా క్యాట్ రెడ్ కార్పెట్ మీద నడిచిన ప్రతిసారీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈసారి కూడా ఆమె పూర్తి స్థాయిలో విజయం సాధించింది. డోజా మెట్ గాలా కోసం పిల్లి రూపం దర్శనమిచ్చేలా డ్రెస్ తో కనువిందు చేసింది. రాపర్ ధరించిన పిల్లి తరహా దుస్తులు అందరినీ ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. అంతేకాదు ఆమె దుస్తులూ, మేకప్‌లు అందరి దృష్టినీ ఆకర్షించాయి.

జారెడ్ లెటో ఒక పెద్ద పిల్లి దుస్తులను ధరించి రెడ్ కార్పెట్‌పై దర్శనం ఇచ్చాడు. మొదట జారెడ్ తన తలపై పెద్ద పిల్లి ముఖంతో ఉన్న డ్రెస్ తో కార్పెట్ పై అడుగు పెట్టాడు. అక్కడ ఉన్న ప్రజలకు ముందుగా అతను ఎవరో అర్థం కాలేదు. కొంచెం సేపటి తర్వాత జారెడ్ తన పిల్లి ముఖాన్ని తీసివేసిన తర్వాత అతడిని అందరూ గుర్తించారు.


మెట్ గాలా ఈవెంట్‌లో జిగి హడిద్ కూడా అందరి హృదయాలను గెలుచుకుంది. గిగా నల్లటి పారదర్శకమైన దుస్తులలో అద్భుతంగా కనిపించింది. ఆమె నెట్టెడ్ దుస్తులకు కూడా పొడవాటి తోక ఉంది. ఆల్ బ్లాక్ గా డిజైన్ చేసిన దుస్తులతో పాటు, ఆమె ధరించిన ముత్యాల నెక్‌పీస్ అందరినీ ఆకట్టుకుంది.

రాపర్, నటి, స్పోక్ పర్సన్ , వ్యాపారవేత్త మాత్రమే కాదు.. కార్డి B ఒక ఫ్యాషన్ అభిమాని. కార్డి బికి ఫ్యాషన్ అంటే నిజమైన అర్థం తెలుసన్నారు. 2023 మెట్ గాలా కోసం ఆమె లుక్ ఆకర్షణీయంగా ఉంది. కార్డి బి తన నల్లటి గౌనుతో టై ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ లుక్ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.





























