Shani Jayanti 2023: ఈ నెల 19న శని జయంతి.. జాతకంలో శని దోషం ఉంటే.. నివారణ చర్యలు, పూజా విధానం మీ కోసం

జాతకంలో శని దోషం ఉంటె ఆ వ్యక్తి జీవితంలో అసమ్మతి, బాధలు, అనేక రకాల బాధలు కలుగుతాయి. ఎవరి జీవితంలో అకస్మాత్తుగా మార్పు వస్తే.. శనీశ్వరుడు పుట్టిన రోజు అయిన ప్రత్యేక పూజాదికార్యక్రమాలను నిర్వహించాలి. వైశాఖ మాసం అమావాస్య రోజున అంటే 19 మే 2023 నాడు శనీశ్వరుడు జయంతిని జరుపుకుంటారు.

Shani Jayanti 2023: ఈ నెల 19న శని జయంతి.. జాతకంలో శని దోషం ఉంటే.. నివారణ చర్యలు, పూజా విధానం మీ కోసం
Shani Yoga
Follow us
Surya Kala

|

Updated on: May 09, 2023 | 10:51 AM

హిందూ సనాతన సంప్రదాయంలో సూర్య భగవానుడి కుమారుడైన శనీశ్వరుడు కర్మల ప్రదాత అని నమ్మకం. శనీశ్వరుడు అనుగ్రహం లభించిన వ్యక్తి సామాన్యుడైనా రాజవుతాడు. అదే సమయంలో అతని వక్ర దృష్టి సోకిన అతను రాజు నుండి బిచ్చగాడుగా మారిపోతారు. జాతకంలో శని దోషం ఉంటె ఆ వ్యక్తి జీవితంలో అసమ్మతి, బాధలు, అనేక రకాల బాధలు కలుగుతాయి. ఎవరి జీవితంలో అకస్మాత్తుగా మార్పు వస్తే.. శనీశ్వరుడు పుట్టిన రోజు అయిన ప్రత్యేక పూజాదికార్యక్రమాలను నిర్వహించాలి. వైశాఖ మాసం అమావాస్య రోజున అంటే 19 మే 2023 నాడు శనీశ్వరుడు జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున చేసే శని జయంతి రోజున చేయాల్సిన పూజ, పరిహారం గురించి తెలుసుకుందాం.

శని జయంతి పూజా విధానం ఎవరి జాతకంలో శని దోషం ఉన్నా.. లేదా శనీశ్వరుడు కారణంగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా..  శనీశ్వరుడు బాధలనుంచి బయటపడటానికి.. శని జయంతి రోజున శనీశ్వరుడుని పూజించాలి. హిందూ విశ్వాసం ప్రకారం శనీశ్వరుడుకి ఆవాల నూనెను సమర్పించడం చాలా ముఖ్యమైనది. అయితే శుభఫలితాలను పొందడానికి దీనికి కొన్ని నియమాలున్నాయి.

హిందూ విశ్వాసం ప్రకారం, శని జయంతి రోజున స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో ఒక గిన్నెలో నూనె వేసుకుని ఆ నూనెలో తన ముఖాన్ని చూసుకోవాలి. తరువాత, ‘ఓం శం శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ పూర్తి భక్తి , విశ్వాసంతో ఆ నూనెను సమర్పించండి. ఈ పరిహారం చేయడం ద్వారా.. శనీశ్వరుడు కలిగించే అన్ని కష్టాలు త్వరగా తొలగిపోతాయని, శని దేవుడి అనుగ్రహం వ్యక్తిపై కురుస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

శని దర్శనం వల్ల సర్వ దుఃఖాలు తొలగిపోతాయి హిందూ విశ్వాసం ప్రకారం శని జయంతి రోజున శనిశ్వరుడు పూజ మాత్రమే కాదు.. దర్శనం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం శని జయంతి రోజున వీలైతే.. శనీశ్వరుడి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని నీలి రంగు పువ్వులను సమర్పించండి. హిందూ విశ్వాసాల ప్రకారం, మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయం, తమిళనాడులోని తిరునల్రు ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉన్న కోకిలవన్ ధామ్, ఆంధ్రప్రదేశ్ లో మందపల్లి శనీశ్వరుడిని దర్శించుకోవడానికి, ఆరాధించడానికి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.

జాతకంలో శని దోష నివారణ కోసం  మీ జాతకంలో శని దోషం ఉంటే..  పైన పేర్కొన్న చర్యలతో పాటు కొన్ని నియమాలను కూడా పాటించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దోషాన్ని నివారించడానికి ఒక వ్యక్తి శనివారం నాడు బూట్లు మరియు చెప్పులు కొనకూడదు. అదే విధంగా ఎవరి నుండి పాదరక్షలను బహుమతిగా తీసుకోకూడదు. శని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే పొరపాటున కూడా ఏ బలహీన, వికలాంగుడిని హింసించకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).