కుజ, శుక్ర గ్రహాల కలయిక ప్రభావం.. ఆ రాశుల వారిలో విపరీత కామ వాంఛలు.. అడ్డదారులు తొక్కితే అంతే సంగతలు

కొద్ది రోజుల క్రితం మిధున రాశితో ప్రారంభమైన కుజ, శుక్ర గ్రహాల కలయిక దాదాపు ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగిపోతుంది. ఈ రెండు గ్రహాలు ఒకటి రెండు రోజుల్లో కర్కాటక రాశిలోనూ ఆ తరువాత సింహరాశిలోనూ కలిసి ఉండబోతున్నాయి.

కుజ, శుక్ర గ్రహాల కలయిక ప్రభావం.. ఆ రాశుల వారిలో విపరీత కామ వాంఛలు.. అడ్డదారులు తొక్కితే అంతే సంగతలు
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 09, 2023 | 4:56 PM

కొద్ది రోజుల క్రితం మిధున రాశితో ప్రారంభమైన కుజ, శుక్ర గ్రహాల కలయిక దాదాపు ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగిపోతుంది. ఈ రెండు గ్రహాలు ఒకటి రెండు రోజుల్లో కర్కాటక రాశిలోనూ ఆ తరువాత సింహరాశిలోనూ కలిసి ఉండబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ ఈ రెండు గ్రహాలు ఎక్కడ ఏ రాశిలో కలిసినప్పటికీ కామ వాంఛను ప్రకోపింప చేస్తుంది. ఈ రెండు గ్రహాలు కామానికి, శారీరక సుఖానికి కారకులు. మధ్య మధ్య కొద్దిరోజుల విరామంతో ఈ రెండు గ్రహాలు ఆగస్టు మధ్య వరకు కలిసి ఉండటం అరుదైన విశేషం. ఈ కలయిక వల్ల దాదాపు అన్ని రాశుల వారి లోనూ కామ వాంఛ హద్దులు మీరే అవకాశం ఉంది. జాతక చక్రాన్ని బట్టి రాశుల లక్షణాలను బట్టి గ్రహాల స్థితి గతులను బట్టి ఒక్కొక్క రాశిలో ఈ కోరిక ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటుంది.

సానుకూల మార్పులు..

ఈ రెండు గ్రహాల కలయిక వల్ల దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయే అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి, కొత్త పద్ధతులు నేర్చుకోవడానికి ఈ రెండు గ్రహాల కలయిక అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానయోగం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. వృద్ధులలో సైతం కోరిక కలగటానికి ఈ గ్రహాల కలయిక ఎంతగానో దోహదం చేస్తుంది. వ్యక్తులలో వికృత చేష్టలు పెరగటం కూడా జరుగుతుంది. జ్యోతిషశాస్త్రంతో ఈ రెండు గ్రహాల కలయిక మీద విస్తృతంగా అధ్యయనం జరిగి అనేక గ్రంథాలు వెలువడటం కూడా జరిగింది. కుజ, శుక్ర గ్రహాలు కామానికి కారకులు. పాశ్చాత్య జ్యోతిష గ్రంధాల ప్రకారం ఈ కలయిక వల్ల వ్యక్తులలో కొత్త ఎనర్జీ పుట్టుకు వస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రతికూల మార్పులు

సాధారణంగా కామ వాంఛ అసాధారణంగా ప్రకోపించడం వల్ల వ్యక్తుల జీవితాలలో సమస్యలు తలెత్తడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక లో నెగటివ్ ఫలితాలను పరిశీలిస్తే అత్యాచారాలు, వికృతి చేష్టలకు కూడా అవకాశం కనిపిస్తుంది. అక్రమ సంబంధాలకు స్త్రీ లోలత్వానికి వ్యసనాలకు కూడా ఈ కలయిక చాలావరకు దారి తీస్తూ ఉంటుంది. శారీరకంగానే కాక మానసికంగా కూడా వ్యక్తులలో ఎన్నో మార్పులకు ఈ కలయిక కారణం అవుతుంది. అందువల్ల ప్రతి రాశి వారూ కొద్దిగా సంయమనంతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఈనెల 10వ తేదీ తరువాత ఈ రెండు గ్రహాల కలయిక కర్కాటకంలో చోటు చేసుకోబోతున్నందువల్ల వివిధ రాశుల వారు తమ కోరికల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ కలయిక కుజ గ్రహానికి నీచరాశి అయిన కర్కాటకంలో జరగబోతున్నందువల్ల మంచి చెడు విచక్షణకు కూడా అవకాశం ఉండదు. పైగా గురు గ్రహ వీక్షణ కూడా లేనందువలన ఈ గ్రహాలు మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉంది.

మేషం, కర్కాటకం, తుల, మకరం

ఈ నాలుగు చర రాశులకు చెందిన వారికి దూకుడు తత్వం ఎక్కువగా ఉంటుంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ముందు ఆలోచించకపోవడం వీరి లక్షణాలు. అందువల్ల కోరిక కలిగిన వెంటనే ఏదో విధంగా తీర్చేసుకోవాలనే ఆరాటం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారికి కేంద్ర స్థానంలో కుజ, శుక్ర గ్రహాలు కలుస్తున్నందువల్ల వీరిలో కామ వాంఛకు సంబంధించిన ధ్యాస పేట్రేగే అవకాశం ఉంది. నిజానికి దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు పెరగటానికి అవకాశం ఉన్నప్పటికీ దారి తప్పే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వికృత పోకడలకు పోయే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనివల్ల ఆర్థిక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వృషభం, సింహం, వృశ్చికం, కుంభం

ఈ నాలుగు స్థిరరాశులకు సంబంధించిన వారు కొద్దిగా సంయమనంతో, నిగ్రహంతో వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికీ, దారి తప్పడానికి ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ప్రయోగాలు చేయడానికి కొత్త పద్ధతులు అనుసరించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇందులో కూడా సహజంగానే కామ వాంఛ ఎక్కువగా ఉండే వృషభ, వృశ్చిక రాశి వారు అక్రమ సంబంధాలకు అవకాశం ఇచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అయితే, ఇవి స్థిరరాశులు అయినందువల్ల దాంపత్య జీవితం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం కూడా జరుగుతుంది. సాధారణంగా ఈ రాశుల వారు తమకు అందుబాటులో ఉన్న వారితో సంబంధం పెట్టుకోవడం కానీ, సుఖాన్ని పొందటం కానీ జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా కొనసాగుతాయి.

మిథునం, కన్య, ధనుస్సు, మీనం

ద్విస్వభావ రాశులయిన ఈ నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు ఎక్కువగా రహస్యంగా తమ కోర్కెలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. వీరు సాధారణంగా ఎక్కడా బయటపడరు కానీ వీరు తమ వాంఛలను తీర్చుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు. ఈ రాశుల వారు ఎక్కువగా అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుంది. కుజ, శుక్ర గ్రహాల కలయిక ఈ రాశులకు ఎంతగానో అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. సాధారణంగా బంధువులు లేదా సన్నిహితులకు సంబంధించిన వారితో కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటుంది. వీరిలో సంయమనం, నిగ్రహం చాలా తక్కువగా ఉంటాయి. అవసరమైతే దాంపత్య జీవితం మీద కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టరు. ఆరోగ్య పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది.