Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Widow Spider: సంభోగం తర్వాత మగ సాలీడుని తినేసే ఈ సాలీడు పాము కంటే ప్రమాదం.. కాటు వేస్తే ఇక అంతే..

మానవులు సాలెపురుగులను చిన్న జీవులుగా పరిగణించి విస్మరిస్తారు. వీటి వలన తమకు ఎలాంటి ప్రమాదం లేదని భావిస్తారు. కానీ ఇది అస్సలు నిజం కాదు.. ఎందుకంటే ప్రపంచంలో పాముల కంటే ప్రమాదకరమైన సాలె పురుగున్నాయి.

Black Widow Spider: సంభోగం తర్వాత మగ సాలీడుని తినేసే ఈ సాలీడు పాము కంటే ప్రమాదం.. కాటు వేస్తే ఇక అంతే..
Black Widow Spider
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2023 | 8:37 AM

విషపూరిత జంతువులు అంటే పాములు, తేళ్లు, జెర్రీ వంటివి అనుకుంటారు. వీటిల్లో పాము కనిపిస్తే చాలు.. అది విష పూరితమైన , కానున్నా దూరంగా పరుగులు తీస్తారు. పాములు ప్రమాదకరమైనవి.. ఒకసారి పాము కాటేసిందంటే తమ పని అయిపోయిందని  భయపడతారు. అందుకనే పాములకు జంతువులు మాత్రమే కాదు మానవులు కూడా దూరంగా ఉంటారు. మరోవైపు, మానవులు సాలెపురుగులను చిన్న జీవులుగా పరిగణించి విస్మరిస్తారు. వీటి వలన తమకు ఎలాంటి ప్రమాదం లేదని భావిస్తారు. కానీ ఇది అస్సలు నిజం కాదు.. ఎందుకంటే ప్రపంచంలో పాముల కంటే ప్రమాదకరమైన సాలె పురుగున్నాయి. వీటిల్లో పాముల కంటే ఎక్కువ విషం ఉంటుంది. ఈ రోజు మనం పాము కంటే 15 రెట్లు ఎక్కువ విషాన్ని కలిగి ఉన్న సాలీడు గురించి తెలుసుకుందాం..

ఈ సాలె పురుగులను బ్లడ్ విడో స్పైడర్ అంటారు. వీటి శాస్త్రీయ నామం లాట్రోడెక్టస్. ఈ సాలీడులు సాధారణంగా ఉత్తర అమెరికా,  కెనడాలో కనిపిస్థాయి. నీలం రంగులో ఉంటాయి. వీటిల్లో బ్లాక్ విడో స్పైడర్ విషపూరితమైనది. ఆడ నల్ల వితంతువు సాలీడు విషం పాము కంటే ప్రమాదకరమని చెబుతారు. ఇవి ఎవరినైనా కాటు వేస్తే.. కండరాలలో నొప్పి , తిమ్మిరి ఉంటుంది. క్రమంగా వారి కళ్ళ ముందు చీకటి కనిపించడం ప్రారంభమవుతుంది.  శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు.

ఈ సాలీడు సంభోగం తర్వాత తన భాగస్వామిని నమిలి తింటుంది! ఈ సాలీడు వెనుక ఎరుపులో ఉంటుంది కనుక దీనిని సులభంగా గుర్తించవచ్చు. ఆడ సాలెపురుగులు సంభోగం తర్వాత కొన్నిసార్లు మగ సాలీడుని  చంపి తింటాయని పరిశోధనల్లో గుర్తించి.. వీటికి బ్లాక్ విడో స్పైడర్‌ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల, ఈ స్పైడర్ గురించి ఒక నివేదికలో బ్లాక్ విడో స్పైడర్ ఆకలి వేస్తె.. తన భాగస్వామిని చంపి తింటుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మగ సాలీడుకు ఆడ సాలీడుతో సంబంధముండడం జీవన్మరణ ప్రశ్న అయితే అని చెప్పాలి. అయితే దీనిని నివారించేందుకు ప్రకృతి మగ సాలీడుకు ఆయుధం కూడా ఇచ్చింది. నిజానికి ఆడ సాలీడు ఆకలిగా ఉన్నప్పుడు దాని శరీరం నుంచి రసాయనం విడుదలవుతుంది. దీంతో మగ సాలీడు వాసన చూడటం ద్వారా ఆడ సాలీడు ఆకలితో ఉందో లేదో అంచనా వేస్తుంది. దానిని బట్టి ఆడ సాలీడు వద్దకు వెళ్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..