- Telugu News Photo Gallery Science photos Chameleon changes color just by seeing the opportunity know about this in telugu
Chameleon: అవకాశం వస్తే ఊసరవెల్లులు నిజంగా రంగులు మార్చుకుంటాయా.. నిజం ఏమిటో తెలుసా..!
ఎవరైనా తమకు అనుగుణంగా ఆలోచనలు మార్చుకుంటుంటే ఊసరవెల్లులా రంగులు మారుస్తున్నాడు అని అంటారు. వాస్తవానికి ఊసరవెల్లి రంగులు మారుతున్నాయా.. అని ఆలోచిస్తారు. ఊసరవెల్లి అవకాశం చూసి రంగు మార్చుకుంటుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం.
Updated on: May 28, 2023 | 1:00 PM

ఊసర వెల్లి సహజ గుణం రంగులు మార్చడం. ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులోకి మారిపొయి రక్షణ పొందుతుంది. తనని తాను కాపాడుకుంటుంది.

అవును ప్రదేశాన్ని బట్టి ఊసరవెల్లి రంగు మారుతుంది. వాస్తవం ఏమిటంటే ఊసరవెల్లి ఉష్ణోగ్రత, మానసిక స్థితిని బట్టి రంగును మారుస్తుంది. ఊసరవెల్లి రంగు మారడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది.

దీని చర్మంలో ప్రత్యేక రకాల క్రోమాటోఫోర్ కణాలు ఉన్నాయి. అంతేకాదు నానో స్ఫటికాల జాలక ఊసరవెల్లి చర్మంలోని కణాల పై పొరలో ఉంటుంది. అందులో ఉండే పిగ్మెంట్ల సహాయంతో ఊసరవెల్లి తన అవసరాలకు అనుగుణంగా వివిధ రంగులను మారుస్తుంది.

అంతేకాదు ఊసర వెల్లి తన రక్షణ కోసం రంగులను మార్చుకుంటాడు. తనకు ఆపద వస్తుందని భావించినప్పుడల్లా అవకాశం చూసి రంగు మార్చుకుంటుంది.

ఇంకొక విశేషం ఏమిటంటే ఊసరవెల్లి నాలుక సహజంగా కన్నా పొడుగు ఉంటుంది. తనకు దూరంగా ఉన్న క్రిమి, కీటకాలను నాలికతో వేటాడుతుంది. వాటిని నాలికతో చటుక్కున పట్టుకుని గుటుక్కున నోట్లో పెట్టుకుంది

ఈ ఊసర వెల్లిని కొందరు మాంసాహారంగా తీసుకుంటారు. అతి నెమ్మదిగా నడుస్తుంది. ఊసరవెల్లి పట్టుని ఉడుం పట్టుని అని కూడా అంటారు. దేనినైనా చాలా గట్టిగా పట్టుకుంటుంది.




