Mobile Blast: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాటు చేయొద్దు.. బాంబులా పేలే ప్రమాదం ఉంది..!
Mobile Charging Tips: మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ సురక్షితంగా ఉండటానికి, ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అనేక విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చాలామంది తమ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు.. కొన్ని పొరపాట్లు చేస్తారు.
Mobile Charging Tips: మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ సురక్షితంగా ఉండటానికి, ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అనేక విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చాలామంది తమ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు.. కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లు ఒక్కోసారి భారీ ప్రమాదాలకు కారణం అవుతాయి. కొన్నిసార్లు మొబైల్ ఫోన్స్ బాంబుళ్లా పేలే ప్రమాదం ఉంది. మరి మీ ఫోన్ ఎప్పుడూ సేఫ్‌గా ఉండాలంటే.. ఛార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. మరి అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
ఫోన్‌ను ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు..
1. ఒకే సాకెట్‌లో రెండు మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టడం చేయొద్దు.
2. ఛార్జింగ్ పెట్టి ఒక ఫోన్‌పై మరొక ఫోన్‌ను పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్లు వేడెక్కి పేలే ప్రమాదం ఉంది.
3. ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు వచ్చిన ఛార్జర్‌తోనే ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టాలి. లేదా సదరు కంపెనీకి చెందిన ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లోకల్ ఛార్జర్‌ను ఉపయోగించడం వల్ల ఫోన్ ఛార్జింగ్ ఎక్కకపోవడం, లేదా కాలిపోవడం జరుగుతుంది.
4. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ను పొరపాటున కూడా ఉపయోగించొద్దు. చాలా మంది ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి కాల్స్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ బాగా వేడెక్కి.. పేలిపోయే ప్రమాదం ఉంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..