Ration Card Complaint: రేషన్ ఇవ్వడం లేదా? తూకంలో తేడా ఉందా? వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి..!

ఇటీవలే చైనాను బీట్ చేసి.. అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఈ జనాభాలో అధిక భాగం పేదలే ఉన్నారు. అయితే, ఆకలితో అలమటించే, ఒక్కపూట అన్నం కోసం అవస్థలు పడే ప్రజల కోసం ప్రభుత్వం రేషన్ అందిస్తోంది. ఇందులో భాగంగానే కోట్లాది మంది పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై రేషన్ పంపిణీ చేస్తోంది.

Ration Card Complaint: రేషన్ ఇవ్వడం లేదా? తూకంలో తేడా ఉందా? వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి..!
Ration Shop
Follow us
Shiva Prajapati

|

Updated on: May 28, 2023 | 8:47 PM

ఇటీవలే చైనాను బీట్ చేసి.. అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఈ జనాభాలో అధిక భాగం పేదలే ఉన్నారు. అయితే, ఆకలితో అలమటించే, ఒక్కపూట అన్నం కోసం అవస్థలు పడే ప్రజల కోసం ప్రభుత్వం రేషన్ అందిస్తోంది. ఇందులో భాగంగానే కోట్లాది మంది పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై రేషన్ పంపిణీ చేస్తోంది. ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్కువ ధరలకు ఆహార ధాన్యాలను ప్రజలకు అందజేస్తుంది. అయితే, ఇతర ప్రభుత్వ పథకాల మాదిరిగానే ఇందులో కూడా అవాంతరాలు ఏర్పడి చాలాసార్లు రేషన్ దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ రేషన్ సరుకులు లభించినా.. తూకంలో మోసం చేస్తున్నారు డీలర్స్.

కరోనా సంక్షోభం..

కరోనా మహమ్మారి సమయంలో కోట్లాది మంది ప్రజలు ఆహారం కోసం అవస్థలు పడ్డారు. తీవ్ర సంక్షోభం ఏర్పడింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మందికి ఉపాధి స్తంభించింది. ఫ్యాక్టరీలు మూతపడటంతో లక్షలాది మంది నిరుద్యోగులుగా మారారు. అలాంటి పరిస్థితిలో, ప్రభుత్వం సబ్సిడీపై, ఉచితంగా రేషన్ అందించే పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ.. దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఉచితంగా రేషన్ అందుతోంది.

ఫిర్యాదు చేయండిలా..

అయితే, రేషన్ షాపులను నిర్వహించే డీలర్లు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. అర్హులైన వారికి రేషన్ ఇవ్వకపోవడం, లేదంటే తూకంలో మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇలాంటి చర్యల పట్ల ప్రభుత్వాలు సీరియస్‌గా ఉన్నాయి. రేషన్ విషయంలో డీలర్లు ఏదైనా ఇబ్బందులకు గురి చేయడం, మోసానికి పాల్పడటం వంటివి చేస్తే వెంటనే కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే.. ప్రతి రాష్ట్రానికి ప్రభుత్వం రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది. ఈ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కంప్లైంట్ వచ్చిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

‘డీలర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’..

రాష్ట్రానికి అనుగుణంగా ఆన్‌లైన్‌లో హెల్ప్‌లైన్ నంబర్‌లు ప్రకటించారు. ఇందుకోసం, అధికారిక వెబ్‌సైట్ https://nfsa.gov.in/ను సందర్శించవచ్చు. ఇక్క ఆయా రాష్ట్రాల హెల్ప్‌లైన్ నంబర్‌ల లిస్ట్ ఉంటుంది. ఈ నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా సమస్య గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత సంబంధిత డీలర్‌పై విచారణ జరుపుతారు. తప్పు తేలితే, డీలర్‌షిప్ క్యాన్సిల్ చేయడమే కాకుండా.. జరిమానా విధించడం, జైలు శిక్ష విధించడం కూడా జరుగుతుంది.

రాష్ట్రాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్‌లివే..

ఆంధ్రప్రదేశ్: 1800-425-2977

అరుణాచల్ ప్రదేశ్: 03602244290

అస్సాం: 1800-345-3611

బీహార్: 1800-3456-194

ఛత్తీస్‌గఢ్: 1800-233-3663

గోవా: 1800-233-0022

గుజరాత్: 1800-233-5500

హర్యానా: 1800-180-2087

హిమాచల్ ప్రదేశ్: 1800-180-8026

జార్ఖండ్: 1800-345-6598, 1800-212-5512

కర్ణాటక: 1800-425-9339

కేరళ: 1800-425-1550

మధ్యప్రదేశ్: 181

మహారాష్ట్ర: 1800-22-4950

మణిపూర్: 1800-345-3821

మేఘాలయ: 1800-345-3670

మిజోరం: 1860-222-222-789, 1800-345-3891

నాగాలాండ్: 1800-345-3704, 1800-345-3705

ఒడిషా: 1800-345-6724 / 6760

పంజాబ్: 1800-3006-1313

రాజస్థాన్: 1800-180-6127

సిక్కిం: 1800-345-3236

తమిళనాడు: 1800-425-5901

తెలంగాణ: 1800-4250-0333

త్రిపుర: 1800-345-3665

ఉత్తర ప్రదేశ్: 1800-180-0150

ఉత్తరాఖండ్: 1800-180-2000, 1800-180-4188

పశ్చిమ బెంగాల్: 1800-345-5505

ఢిల్లీ: 1800-110-841

జమ్మూ: 1800-180-7106

కాశ్మీర్: 1800-180-7011

అండమాన్ & నికోబార్ దీవులు: 1800-343-3197

చండీగఢ్: 1800-180-2068

దాద్రా మరియు నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ: 1800-233-4004

లక్షద్వీప్: 1800-425-3186

పుదుచ్చేరి: 1800-425-1082

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..