DRDO-RAC Jobs 2023: బీటెక్/బీఈ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో 181 ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) పరిధిలోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(ఆర్‌ఏసీ) కింద.. 181 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) పరిధిలోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(ఆర్‌ఏసీ) కింద.. 181 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాలు..
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెటీరియల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, కెమికల్ ప్లాంట్ ఇంజినీరింగ్, అప్లైడ్ కెమికల్ అండ్ పాలిమర్ టెక్నాలజీ, పాలిమర్ సైన్స్ అండ్ కెమికల్ టెక్నాలజీ, సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీర్, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ఇంజినీర్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హతలివే..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్ పరీక్షలో అర్హత సాధించాలి. యూఆర్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్ధుల వయసు 28, ఓబీసీ కేటగిరీకీ 31, ఎస్సీ/ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 33 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల్లోపు (జూన్ 18, 2023వ తేదీలోపు) దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. గేట్ స్కోర్, స్క్రీనింగ్/ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.