Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌ డెత్‌ గేమ్‌.. లైవ్‌లో 7 వోడ్కా బాటిళ్లు తాగాడు.. మత్తులోనే ప్రాణాలు వదిలాడు

టిక్‌టాక్‌ పిచ్చితో ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడో యువకుడు. లైవ్‌ స్ట్రీమింగ్‍లో అపకుండా వోడ్కా బాటిళ్లు ఒకదాని తర్వాత ఒకటి ఫట్‌ఫట్‌మని లాగించేశాడు. అంతే.. పరిమితికి మించి ఆల్కహాల్ సేవించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్‌ ఘటన..

ఆన్‌లైన్‌ డెత్‌ గేమ్‌.. లైవ్‌లో 7 వోడ్కా బాటిళ్లు తాగాడు.. మత్తులోనే ప్రాణాలు వదిలాడు
Chinese Social Media Influencer Died
Follow us
Srilakshmi C

|

Updated on: May 28, 2023 | 8:13 PM

టిక్‌టాక్‌ పిచ్చితో ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడో యువకుడు. లైవ్‌ స్ట్రీమింగ్‍లో అపకుండా వోడ్కా బాటిళ్లు ఒకదాని తర్వాత ఒకటి ఫట్‌ఫట్‌మని లాగించేశాడు. అంతే.. పరిమితికి మించి ఆల్కహాల్ సేవించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్‌ ఘటన చైనాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

చైనా షార్టు వీడియో ప్లాట్‌ఫామ్‌ ‘డౌయిన్’ (చైనా టిక్‌టాక్)‍లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ గేమ్స్‌కు చాలా ఫేమస్‌. పీకే ఛాలెంజెస్‌ పేరిట ఆడే ఈ ఆన్‌లైన్‌ గేమ్‌లు మధ్యరాత్రి ఒంటిగంటకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తాయి. ఈ గేమ్‌ లైవ్‌లో రకరకాల స్టంట్స్ చేస్తూ ఉంటారు. అలరిస్తారు. ఈ క్రమంలో జూవా, సాంక్యూజ్ (34) అనే ఇద్దరు యువకులు బైజియు అనే చైనీస్‌ వోడ్కాను తాగడంలో మే 16న రాత్రి ఒంటి గంటకు లైవ్‌లో పోటీపడ్డారు. ఓడిన వారికి క్రేజీ పనిష్మెంట్‌ ఉంటుంది. దీంతో ఆడియన్స్ నుంచి ఎక్కువ గిఫ్ట్స్ సంపాదించాలనే ఆరాటంతో పోటాపోటీగా తాగారు.

గేమ్‌లో భాగంగా లైవ్‌లో సాంక్యూజ్ అలియాస్‌ వాంగ్‌ లైవ్‍లోనే ఏడుబాటిళ్ల ‘బైజు’ను తాగాడు. ఆ తర్వాత పరిమితికి మించి ఆల్కహాల్‌ సేవించడంతో 12 గంటల వ్యవధిలోనే అతను మృతి చెందాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు చూస్తే అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘బైజు’ డ్రింక్‌లో సాధారణంగా 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఒకబాటిల్ పూర్తిగా తాగితేనే ఉక్కిరిబిక్కిరి అవుతారని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.