Warangal: కొడుకు జల్సాలకు తండ్రి బలి.. ట్రాఫిక్ చలాన్లు కట్టలేదని పురుగుల మందుతాగి వ్యక్తి మృతి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 9 చలాన్లు విధించారు. చలాన్లన్నీ పెండింగ్‌లో ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను తీసుకుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి..
అతను ఓ దినసరి కూలీ. రోజూ బైక్ పై నగరానికి వెళ్లి ఓ బట్టల దుఖాణంలో పనిచేసేవాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 9 చలాన్లు విధించారు. చలాన్లన్నీ పెండింగ్‌లో ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను తీసుకుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు తెల్పిన వివరాలప్రకారం..
మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి (54) వరంగల్‌లోని ఓ బట్టల షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తన బైక్‌పై నిత్యం మల్లారెడ్డిపల్లి నుంచి వరంగల్‌కు వెళ్లి విధులు నిర్వహించేవాడు. తిరిగి రాత్రికి అదే బైక్‌పై ఇంటికి చేరుకునే వాడు. కొడుకు సూర్య కూడా ఆ బైక్ పై స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మొగిలి బైక్‌పై 9 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు నమోదయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు మే 21న వాహన తనిఖీల్లో భాగంగా చూడగా మొగిలి చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గమనించారు. పెండింగ్ చలాన్లు కట్టి బైక్ తీసుకెళ్లాలని చెప్పి.. మొగిలి బైక్‌ను తీసుకుకెళ్లారు.
దీంతో చేసేదిలేక మల్లారెడ్డిపల్లికి ఆటోలో వెళ్లాడు. బైక్ లేకపోవడం వల్ల వరంగల్‌లో తాను పనిచేస్తున్న షాపులో విధులకు వెళ్లలేనని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్య శరణ్యమని ఆవేదనతో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మొగిలి మృతి చెందాడు. తన తండ్రి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమని కుమారుడు సూర్య హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.