రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన దినసరి కూలీ.. అకౌంట్లో రూ.100 కోట్లు జమ.. నోటీసులు పంపిన అధికారులు
ఓ దిన సరి కూలి రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు. అతని బ్యాంక్అకౌంట్కు ఉన్నపలంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలీక ఆ కూలీ అష్టకష్టాలు పడ్డాడు. అసలేం జరిగింటే..
ఓ దిన సరి కూలి రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు. అతని బ్యాంక్అకౌంట్కు ఉన్నపలంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలీక ఆ కూలీ అష్టకష్టాలు పడ్డాడు. అసలేం జరిగింటే..
బెంగాల్ దేగంగాలోని వాసుదేవ్పుర్కు చెందిన మహ్మద్ నసీరుల్లా (26) ఓ వ్యవసాయ కూలీ. అతడికి తల్లిదండ్రులతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నసీరుల్లా కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఐతే నసీరుల్లాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి అప్పుడప్పుడు నసీరుల్లా లావాదేవీలు జరిపేవాడు. ఐతే వేల డబ్బును ఒక్కసారి కూడా డిపాజిట్ చేయడంగానీ, విత్‌డ్రా చేయడం గానీ జరగలేదు. దినసరి కూలి అయిన నసీరుల్లా అకౌంట్‌లో రూ.17 మాత్రమే ఉన్నాయి. ఐతే తాజాగా తన అకౌంట్‌లో రూ.100 కోట్లు జమ అయినట్లు నసీరుల్లా గుర్తించాడు. దీంతో ఆయనకు జంగీపుర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపారు. మే 30లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో భయభ్రాంతులకు గురైన నసీరుల్లా ఆ డబ్బులు తన అకౌంట్‌కు ఎలా వచ్చి చేరిందో తెలియక తలపట్టుకున్నాడు. దీంతో బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో బ్యాంకు అధికారులు నసీరుల్లా బ్యాంక్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు.
100 మంది ఖాతాల్లో రూ.13 కోట్ల జమ..
గతేడాది మేలో తమిళనాడులో ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. చెన్నైలోని టీనగర్హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. తమ మొబైల్ ఫోన్‌లకు వచ్చిన మెసేజ్‌లు చూసి అవాక్కయ్యారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.13 కోట్లు జమ అయ్యాయి. వారిలో కొంతమంది ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. మరికొందరు సైలంట్‌గా ఉండిపోయారు. సాంకేతిక లోపం వల్ల బదిలీ జరిగిందా? లేదా బ్యాంకు ఇంటర్నెట్ సర్వీస్‌ను హ్యాక్ చేసి ఎవరైనా నగదు బదిలీ చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై బ్యాంకు ఖాతాదారులు ఫెడరల్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్ విభాగానికి ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం విశేషం. పైగా సెంట్రల్ క్రిమినల్ విభాగానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.