CM Jagan: సీఎం జగన్ కాన్వాయ్‌ను అడ్డుకోబోయిన హెడ్ కానిస్టేబుల్.. ఇంతకీ విషయమేమంటే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ఓ హెడ్‌కానిస్టేబుల్ అడ్డుపడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తాడేపల్లిలో మంగళవారం (మే 23) చోటుచేసుకుంది. నిన్న గుంటూరు వెళ్లిన సీఎం హెలికాప్టర్‌లో తిరిగి తాడేపల్లికి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ఓ హెడ్‌కానిస్టేబుల్ అడ్డుపడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తాడేపల్లిలో మంగళవారం (మే 23) చోటుచేసుకుంది. నిన్న గుంటూరు వెళ్లిన సీఎం హెలికాప్టర్‌లో తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. ఈ క్రమంలో హెలిప్యాడ్ నుంచి సీఎం తన వాహనంలో నివాసానికి బయలుదేరారు.
ఇదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న సీఎం కాన్వాయ్‌కు హెడ్ కానిస్టేబుల్ అడ్డుపడే ప్రయత్నం చేశారు. విశాఖపట్నంకు చెందిన 16వ ఏపీఎస్పీ బెటాలియన్ బి-కంపెనీలో గార్డు-1 కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌గా పెద్దిరెడ్డి భాగ్యరాజుగా గుర్తించారు. ఇంతలో సీఎం భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ హెడ్‌కానిస్టేబుల్‌ని అదుపులోకి తీసుకున్నారు. పెద్దిరెడ్డి భాగ్యరాజు విశాఖలో పనిచేస్తుండగా.. తన భార్య విజయవాడలో విధులు నిర్వహిస్తోందని తెలిపాడు. తామిద్దరికీ ఒకే చోట పనిచేసేందుకు అవకాశమివ్వాలని సీఎంకు విన్నవించేందుకే ఇలా చేశానని విచారణలో తేలిపాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.