Suryapet: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కిటికి అద్దం పైకి లేపడంతో తల బయటపెట్టి చూస్తున్న చిన్నారి మృతి

బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఓ చిన్నారి మృతి చెందింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా పెళ్లి ఇంట విషాదం నెలకొంది. తెలంగాణ సూర్యపేట జిల్లాలో ఆదివారం (మే 21) ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Suryapet: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కిటికి అద్దం పైకి లేపడంతో తల బయటపెట్టి చూస్తున్న చిన్నారి మృతి
9 Year Old Girl Child Died
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2023 | 10:18 AM

బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఓ చిన్నారి మృతి చెందింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా పెళ్లి ఇంట విషాదం నెలకొంది. తెలంగాణ సూర్యపేట జిల్లాలో ఆదివారం (మే 21) ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వరుడు, వధువులు కారు ఊరేగింపు వేడుక జరుగుతోంది. బాణోతు ఇంద్రజ(9) అనే చిన్నారి కారు వెనుక సీటులో ఒంటరిగా కూర్చొని కిటీకీలోంచి తల బయట పెట్టి డ్యాన్సులు చూస్తోంది. ఐతే ఇదే సమయంలో చిన్నారిని గమనించని కారు డ్రైవర్‌ డోర్‌ అద్దం బటన్‌ నొక్కాడు. దీంతో చిన్నారి మెడ కారు కిటికీలో ఇరుక్కుని పోయింది. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది.

దీంతో అప్పటి వరకు హుషారుగా జరుగుతున్న పెళ్లింట ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవరు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.