Real Estate: దేశంలో రియల్ ఎస్టేట్ భూమ్.. ఈ ఏడు నగరాల్లో రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు, కొనుగోళ్లు..
దేశంలోని ఇళ్ల నిర్మాణంపై అనరోక్ ప్రాజెక్టు సంస్థ రిపోర్ట్‌లో పలు సంచలనాలు బయటకొచ్చాయి. 8 నగరాలపై చేసిన ప్రాజెక్టు సర్వేలో 2023లో 5.58లక్షల ఇళ్లు పూర్తయినట్టు ప్రకటించింది. మొదటి స్థానంలో నేషనల్ క్యాపిటల్ రిజియన్‌లో ఎక్కువగా ఉన్నాయి.
దేశంలోని ఇళ్ల నిర్మాణంపై అనరోక్ ప్రాజెక్టు సంస్థ రిపోర్ట్‌లో పలు సంచలనాలు బయటకొచ్చాయి. 8 నగరాలపై చేసిన ప్రాజెక్టు సర్వేలో 2023లో 5.58లక్షల ఇళ్లు పూర్తయినట్టు ప్రకటించింది. మొదటి స్థానంలో నేషనల్ క్యాపిటల్ రిజియన్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 97శాతం అభివృద్ధితో 1.7లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 2023లో లక్షా 70వేల ఇళ్లు పూర్తయితే.. అదే.. 2022లో 86వేల 300 మాత్రమే నిర్మించారు. ఎన్‌సీఆర్‌కు దగ్గరలోనే ముంబై మెట్రోపాలిటన్ రిజియన్ చోటు సంపాదించుకుంది. ఇక్కడ 24శాతం వృద్దితో లక్షా 31 వేల ఇళ్లు పూర్తయ్యాయి. గత సంవత్సరం లక్షా 26 వేల ఇళ్ల కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో 4 శాతం అభివృద్ధితో 23వేల8వందల ఇళ్లు పూర్తయ్యాయి. గత ఏడాది 11వేల 700 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
దేశంలో మొత్తంగా 39 శాతం అభివృద్దితో 2023లో రియల్ ఎస్టేట్ దూసుకు పోతోంది. టాప్ ఏడు నగరాల్లో 5.6లక్షల ఇళ్లు రికార్డు స్థాయిలో పూర్తయ్యాయి. ఇండియన్ రెసిడెన్సియల్ రియల్ ఎస్టేట్‌లో 0.5 మిలియన్ డెలివరీస్ జరిగాయి. ఈ ఏడాది చివరి నాటికి 2.8శాతం వృద్ధితో ముందుకు వెళ్తుందని అంచనా వేస్తుంది. అన్ని సిటీలలో కెళ్లా ముంబైలో 80వేల ఇళ్లు డెలివరీస్ జరిగాయి. చైన్నైలో 17,400, కోల్‌కతాలో 36,700 ఉన్నాయి. కోల్‌కతాలో 23వేల 200 ఇళ్లు పూర్తయ్యాయి. రెరా నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం జరుగుతుండడంతో కస్టమర్ల నమ్మకాన్ని కూడా పొందుతున్నాయి.
మార్కెట్‌లో నగదు ప్రవాహం కూడా అనుకున్న స్థాయిలో ఉండడంతో ఇళ్ల నిర్మాణం ముందుకెళ్తోంది. నిర్మాణంతో పాటు అమ్మకాలు, డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. పలు సవాళ్లను ఎదుర్కొంటూ 2023లో కొత్త రికార్డును సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..