AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Shop Rush: రూ. 2,000 నోట్ల ఉపసంహరణ.. పెరిగిన బంగారం కొనుగోళ్లు .. ధర పెంచి మరీ అమ్ముతున్న షాప్స్..

రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను అప్పుడు వ్యాపారులు తీసుకున్నారు. ఆ తర్వాత, పెద్ద స్థాయిలో నగదు ఆధారిత అమ్మకాలు జరిపినందుకు ఆదాయ పన్ను విభాగం నుంచి విచారణలు ఎదుర్కొన్నారు. ఆ సీన్‌ ఇప్పుడు రిపీట్‌ కాకుండా, బంగారం షాపుల యజమానులు కస్టమర్లకు కొన్ని షరతులు పెడుతున్నారు.

Gold Shop Rush: రూ. 2,000 నోట్ల ఉపసంహరణ.. పెరిగిన బంగారం కొనుగోళ్లు .. ధర పెంచి మరీ అమ్ముతున్న షాప్స్..
2000 Notes Withdrawal
Follow us
Surya Kala

|

Updated on: May 23, 2023 | 6:50 AM

రెండు వేల నోట్ల ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ బ్యాంక్ ప్రకటించి.. బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తే జనాలు మాత్రం బంగారం షాపులకు పరిగెడుతున్నారు. పింక్‌ నోట్లతో జువెల్లరీ దుకాణాలకు క్యూ కట్టారు. కస్టమర్ల రద్దీతో బంగారం వ్యాపారులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని RBI నిర్ణయం తీసుకున్న తర్వాత, దేశవ్యాప్తంగా అనూహ్యంగా నగదు రూప కొనుగోళ్లు పెరిగాయి. UPI లావాదేవీలు, డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌ వాడిన వాళ్లు కూడా ఇప్పుడు పింక్‌ నోట్లతో కొనుగోళ్లు చేస్తున్నారు. ఇళ్లలో, లాకర్లలో దాచిన 2000 నోట్లను బయటకు తీసి, ఏదోక వస్తువు కొంటున్నారు.

2000 వేల నోటు ఉపసంహణ నిర్ణయం తర్వాత బంగారం, వజ్రాభరణాల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయిలో ఉంది. అయినా 2000k నోట్లను వదిలించుకోవడానికి జనం నోట్ల కట్టలు పట్టుకుని నగలు, వజ్రాభరణాల షాపులకు పరుగులు తీస్తున్నారు. నిన్నా, మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో బంగారం కొనుగోళ్ళు అంటేనే దూరం పారిపోయిన వాళ్ళు ఇప్పుడు ఆర్బీఐ నిర్ణయం దెబ్బకు బంగారం కొనుగోళ్ళపై ఫోకస్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు పెరిగాయి. పెరిగిన బంగారం, వజ్రాభరణాల అమ్మకాలు, కస్టమర్ల రద్దీతో వ్యాపారులు ఖుషీగా ఉన్నారు.

అయితే, 2016 డీమోనిటైజేషన్‌ తర్వాతి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 2016లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు కూడా బంగారం షాపుల్లో రద్దీ పెరిగింది. రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను అప్పుడు వ్యాపారులు తీసుకున్నారు. ఆ తర్వాత, పెద్ద స్థాయిలో నగదు ఆధారిత అమ్మకాలు జరిపినందుకు ఆదాయ పన్ను విభాగం నుంచి విచారణలు ఎదుర్కొన్నారు. ఆ సీన్‌ ఇప్పుడు రిపీట్‌ కాకుండా, బంగారం షాపుల యజమానులు కస్టమర్లకు కొన్ని షరతులు పెడుతున్నారు. ప్రస్తుతం రెండు లక్షల రూపాయల లోపు బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలు కొంటే పాన్, ఆదార్ లాంటి పత్రాలను చూపించక్కరలేదు. కానీ రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి విషయంలో మాత్రం కేవైసీ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు వ్యాపారస్తులు. నోట్లు మార్కెట్లో చెల్లుబాటు కావనే సాకుతో వ్యాపారస్తులు కస్టమర్ల దగ్గర ఎక్కవు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం 60, 200 ఉన్న పది గ్రాముల బంగారం ధరను ఏకంగా 66 వేలకు పెంచేసి మరీ అమ్మతున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..