Darshan Puttanaiah: ట్రైన్‌లో సాధారణ ప్రయాణీకుడిలా ఎమ్మెల్యే.. టెక్కీ నుంచి రైతు నాయకుడు.. ఎమ్మెల్యేగా తొలిసారి ఎంపిక
సోమవారం ఉదయం మండ్యలోని పాండవపుర రైల్వే స్టేషన్‌లో చాముండి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఈ చాముండి ఎక్స్‌ప్రెస్ ప్రభుత్వ ఉద్యోగులు, గార్మెంట్స్ ఫ్యాక్టరీ కార్మికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. తమతో పాటు ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే దర్శన్ కూర్చునేందుకు ప్రయాణికులు ఖాళీ చేసి సీటునిచ్చారు.
ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజల మధ్య తిరిగే రాజకీయ నేతలు.. ఎన్నికల్లో విజయం సాధించి తర్వాత అదే ప్రజల మధ్య ప్రయాణం చేయాలంటే మాత్రం వెనుకాడుతారు. ప్రోటోకాల్ పేరుతో ప్రజా ప్రతినిధులు స్పెషల్ వాహనాల్లో ప్రయాణిస్తారు. అయితే కర్ణాటకలో షాకింగ్ కలిగించే ఘటన చోటు చేసుకుంది. విధాన సౌధలో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యేందుకు మేలుకోటే ఎమ్మెల్యే దర్శన్ పుట్టనయ్య సోమవారం మాండ్యా నుంచి బెంగళూరుకు ఓ సామాన్య ప్రయాణీకుడిలా రైలులో ప్రయాణించారు. దర్శన్ పుట్టనయ్య రైతు నాయకుడు. మాండ్య నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పుట్టన్నయ్య ఎంపికయ్యారు. సోమవారం ఉదయం మండ్యలోని పాండవపుర రైల్వే స్టేషన్‌లో చాముండి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఈ చాముండి ఎక్స్‌ప్రెస్ ప్రభుత్వ ఉద్యోగులు, గార్మెంట్స్ ఫ్యాక్టరీ కార్మికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. తమతో పాటు ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే దర్శన్ కూర్చునేందుకు ప్రయాణికులు ఖాళీ చేసి సీటునిచ్చారు.
తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం అనంతరం శనివారం తొలి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు.
బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కూడా దర్శన్ పుట్టన్నయ్య బెంగళూరు రైలులోనే వెళ్లారు. అప్పుడు దర్శన్ టీ-షర్ట్, షార్ట్ ధరించి ప్రయాణించినట్లు తెలుస్తోంది.
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల దర్శన్ గతంలో టెక్కీగా పనిచేశారు. USలో నివసించే సమయంలో USAలోని డెన్వర్‌లో Qwinix టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించాడు. తన తండ్రి, రైతు నాయకుడు ఎమ్మెల్యే కేఎస్ పుట్టన్నయ్య అకస్మాత్తుగా మరణించడంతో భారతదేశానికి తిరిగి వచ్చి రాజకీయాల్లో చేరారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో మేల్కోటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి సీఎస్ పుట్టరాజుపై దర్శన్ పుట్టనయ్య 10,862 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..