German Surgeon: క్లీనర్ సాయంతో ఆపరేషన్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్న వైద్యుడు.. పేషేంట్స్ క్షేమం..
జర్మనీలో మెయిన్జ్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఒక పేషెంట్‌కి కాలుకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆస్పత్రిలో నర్సింగ్‌కు సంబంధించిన సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దాంతో ఆ వైద్యుడు ఓ క్లీనర్ సాయం తీసుకుని ఆ పేషంట్‌కి ఆపరేషన్ చేసేశాడు.
సాధారణంగా డాక్టర్లు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ట్రైన్డ్ నర్సలు సహాయం తీసుకుంటారు. కానీ ఓ వైద్యుడు మాత్రం ఆస్పత్రి క్లీన్ చేసే వ్యక్తి సాయంతో మేజర్ సర్జరీ చేశాడు. అంతే విషయం బయటకు రావడంతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.
జర్మనీలో మెయిన్జ్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఒక పేషెంట్‌కి కాలుకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆస్పత్రిలో నర్సింగ్‌కు సంబంధించిన సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దాంతో ఆ వైద్యుడు ఓ క్లీనర్ సాయం తీసుకుని ఆ పేషంట్‌కి ఆపరేషన్ చేసేశాడు. పేషెంట్‌కి మత్తుమందు ఇచ్చిన తర్వాత అతని కాలుని సదరు క్లీనర్‌ను పట్టుకోమని చెప్పి ఆపరేషన్ సమయంలో అవసరమైన వైద్య పరికారలను అందించమని చెప్పాడు. ఆపరేషన్ అంతా పూర్తయిన తర్వాత సదరు క్లీనర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు రావడం ఆస్పత్రి యాజమాన్యం గమనించింది. విషయం తెలుసుకుని వైద్యుడిపై మండిపడింది. అంతేకాదు అతన్ని ఉద్యోగంనుంచి తొలగించింది.
అయితే సర్జరీ చేయించుకున్న పేషంట్ ఆరోగ్యంగానే ఉన్నాడు. అతనికి ఏహానీ జరగలేదు కానీ, ఇలాంటి క్లిష్టమైన స్థితిలో సాయం చేసే మెడికల్ సిబ్బంది గురించి వాకబు చేయాలి లేదా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకురావలి గానీ అలా చేయకూడదంటూ సదరు వైద్యుడికి ఆస్పత్రి యాజమాన్యం చివాట్లు పెట్టింది. ఈ షాకింగ్ ఘటన 2020లో జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..