AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: అయ్యో..పెద్దన్నకి ఎంత కష్టం.. తెరుచుకోని గొడుగు.. వర్షంలో తడుస్తూ వెళ్లిన బైడెన్‌

ఇటీవల బైడెన్ జపాన్ పర్యటనకు వెళ్లారు. ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే వర్షం మొదలయింది. దీంతో, బైడెన్ విమానం దిగుతూ తన వద్ద ఉన్న పెద్ద గొడుగును తెరిచే ప్రయత్నం చేశారు. కానీ, అది ఎంతకీ తెరుకుకోలేదు.

America: అయ్యో..పెద్దన్నకి ఎంత కష్టం.. తెరుచుకోని గొడుగు.. వర్షంలో తడుస్తూ వెళ్లిన బైడెన్‌
Joe Biden In Japan
Surya Kala
|

Updated on: May 21, 2023 | 11:13 AM

Share

అనుకోకుండా వర్షం వస్తే ఎంతటివారైనా తడవక తప్పదు. మరీ ఎక్కువగా వస్తే ఏ చెట్టు కిందనో, ఏ బ్రిడ్జి కిందనో తలదాచుకుంటారు. సేఫ్‌సైడ్‌ బ్యాగులో గొడుగు ఉంటే ఓకే. గొడుకు వేసుకొని వెళ్లిపోవచ్చు.. అయితే అంతవరకూ మూలన కూర్చున్న గొడుగు ఉన్నఫలంగా తెరుచుకోమంటే ఒక్కోసారి మొండికేయొచ్చు. సరిగ్గా అదే జరిగింది అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ విషయంలో కూడా. పాపం ఆ గొడుక్కేం తెలుసు మరి అతను ఆదేశ అధ్యక్షుడని.. గొడుగు తన మాట వినకపోవడంతో బైడెన్‌ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్లు, పొరపాట్లకు సంబంధించి గతంలో అనేక వీడియోలో వైరల్ అయ్యాయి. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న మరో వీడియో నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల బైడెన్ జపాన్ పర్యటనకు వెళ్లారు. ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే వర్షం మొదలయింది. దీంతో, బైడెన్ విమానం దిగుతూ తన వద్ద ఉన్న పెద్ద గొడుగును తెరిచే ప్రయత్నం చేశారు. కానీ, అది ఎంతకీ తెరుకుకోలేదు. దాంతో చేసేది లేక ఆయన దాన్ని అలాగే పట్టుకుని వర్షంలో తడుస్తూ వెళ్లి, ఎదురుగా ఉన్న జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రికి అభివాదం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇంతలో బైడెన్ ఇబ్బందిని గమనించిన అమెరికా అధికారులు తమవద్ద ఉన్న గొడుగును పట్టేప్రయత్నం చేసారు. ఆ తరువాత బైడెన్ మరోసారి ప్రయత్నించడంతో గొడుగు తెరుచుకుంది. ఈ వీడియో నెట్టింట చేరి వైరల్‌ కావడంతో పలువురు ఆయనపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు. గొడుగు తెరిచేందుకు ఇంత సేపా అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..