Costly Ice Cream: అక్కడ ఐస్ క్రీమ్ రూ.5.2 లక్షలు.. ఏడాదిన్నర కష్టపడి తయారు చేసిన సంస్థ.. స్పెషలిటీ ఏమిటంటే

వేసవి వచ్చిందంటే చాలు.. వేసవి తాపం ఉపశమనం కోసం ఐస్ క్రీం వైపు దృష్టిసారిస్తారు.  చాలా మందికి ఇష్టమైన డెజర్ట్. చాలా మంది చల్ల చల్లని వెల్వెట్ ఆకృతిలో వివిధ రుచులను ఆనందిస్తారు. అయితే, మీరు ఐస్‌క్రీమ్‌ని ఎంతగా ఆస్వాదించినా.. దాని కోసం మీరు ఎప్పుడైనా ₹ 5.2 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంత కాస్ట్లీ ఐస్ క్రీమ్ ఉంటుందా అని నమ్మక పోవచ్చు.

Costly Ice Cream: అక్కడ ఐస్ క్రీమ్ రూ.5.2 లక్షలు.. ఏడాదిన్నర కష్టపడి తయారు చేసిన సంస్థ.. స్పెషలిటీ ఏమిటంటే
World Costly Ice Cream
Follow us

|

Updated on: May 20, 2023 | 11:47 AM

ఐస్‌క్రీమ్‌ అంటే వయసుకు సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ ఇష్టపడతారు. వెనిలా, బటర్ స్కాచ్, పిస్తా ఇలా రకరకాల ఐస్ క్రీములు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే జపాన్‌కు చెందిన ఓ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేసింది. రకరకాల అరుదైన, కాస్ట్లీ వస్తువులతో తయారు చేసిన ఈ హిమక్రీము ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ గా రికార్డ్ సృష్టించింది.

వేసవి వచ్చిందంటే చాలు.. వేసవి తాపం ఉపశమనం కోసం ఐస్ క్రీం వైపు దృష్టిసారిస్తారు.  చాలా మందికి ఇష్టమైన డెజర్ట్. చాలా మంది చల్ల చల్లని వెల్వెట్ ఆకృతిలో వివిధ రుచులను ఆనందిస్తారు. అయితే, మీరు ఐస్‌క్రీమ్‌ని ఎంతగా ఆస్వాదించినా.. దాని కోసం మీరు ఎప్పుడైనా ₹ 5.2 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంత కాస్ట్లీ ఐస్ క్రీమ్ ఉంటుందా అని నమ్మక పోవచ్చు. అయితే జపాన్‌లో తయారు చేసిన ఐస్‌క్రీం ధర 873,400 జపనీస్ యెన్ (మన దేశ కరెన్సీలో సుమారు ₹ 5.2 లక్షలు). ఈ ఐస్ క్రీమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డ్ సృష్టించింది.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ప్రపంచ రికార్డును సృష్టించే ప్రయత్నంలో.. జపనీస్ ఐస్ క్రీం కంపెనీ సెల్లాటో ఖరీదైన, అరుదైన పదార్థాలను ఉపయోగించి అసాధారణమైన ఐస్ క్రీమ్ ను సృష్టించింది. వారు ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించిన వైట్ ట్రఫుల్ అనే అరుదైన పదార్ధాలను ఉపయోగించారు. ఈ ట్రఫుల్‌ ధర 2 మిలియన్ జపనీస్ యెన్ లు ఉంటుందట. వీటితో పాటు.. పర్మిజియానో ​​రెజియానో అనే చీజ్..  సేక్ లీస్ వంటి వైట్ సాస్ వంటి పదార్ధాలను కూడా వినియోగించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా  గిన్నిస్‌ రికార్డు సాధించింది.

సెల్లాటో ప్రతినిధి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ గురించి మాట్లాడుతూ.. ఈ ఐస్ క్రీమ్ ను అభివృద్ధి చేయడానికి తమకు 1.5 సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ఎన్నో ట్రయల్స్ చేస్తూ.. లోపాలను సారీచేస్తూ.. రుచిగా చేయడానికి ఈ సమయం పట్టిందన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సాధించడం వల్ల తమ ప్రయత్నానికి , శ్రమకు తగిన గుర్తింపు దక్కినట్లు పేర్కొన్నారు

కొన్ని గంటల క్రితం షేర్ చేయబడిన ఈ పోస్ట్ 27,000 లైక్స్ ను, రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది.   ఈ డెజర్ట్ ధర చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.ఐస్ క్రీం లోపల ఏమి ఉందో నాకు అర్థం కాలేదని ఒకరంటే.. ఓ మై గాడ్, చాలా ఖర్చుతో కూడుకున్నది అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన