Violent Storm: తుఫాను బీభత్సం.. గాల్లో చిత్తుకాగితంలా సోఫా చక్కర్లు.. నెట్టింట వీడియో వైరల్

ఈదురు గాలులతోకూడిన భారీ వర్షాలు కురిసినప్పుడు, వరదలు పొంగి పొరలినప్పుడు, ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే బలమైన ఈదురు గాలులకు భారీ వృక్షాలే నేలమట్టమవడం చూస్తూనే ఉంటాం. ఇక తేలికైన వస్తువులైతే అమాంతం గాలిలో కొట్టుకుపోవడం సహజం. కానీ టర్కీలో తుఫాను సృష్టించిన బీభత్సానికి ఓ ఇంట్లోని సోఫాసెట్‌ అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది.

Violent Storm: తుఫాను బీభత్సం.. గాల్లో చిత్తుకాగితంలా సోఫా చక్కర్లు.. నెట్టింట వీడియో వైరల్
Storm In Ankara
Follow us
Surya Kala

|

Updated on: May 19, 2023 | 8:52 AM

మనం ఫ్లయింగ్‌ సాసర్లు, ఆలీబాబా అద్భుత దీపంలోలా మాయా కార్పెట్‌ గాల్లో ఎగరడం చూశాం. కానీ నిజజీవితంలో గాల్లో బలమైన, బరువైన వస్తువులు చిత్తు కాగితాల్లా ఎగరడం ఎప్పుడైనా చూశారా? అయితే ఇప్పుడు ఇలాంటి ఘటన చూస్తే.. ప్రకృతి ఎంత బలీయమైనదో మీకు అర్ధమవుతుంది. టర్కీలోని తుఫాన్ సమయంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకింది. అందుకు సంబంధించిన షాకింగ్  వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈదురు గాలులతోకూడిన భారీ వర్షాలు కురిసినప్పుడు, వరదలు పొంగి పొరలినప్పుడు, ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే బలమైన ఈదురు గాలులకు భారీ వృక్షాలే నేలమట్టమవడం చూస్తూనే ఉంటాం. ఇక తేలికైన వస్తువులైతే అమాంతం గాలిలో కొట్టుకుపోవడం సహజం. కానీ టర్కీలో తుఫాను సృష్టించిన బీభత్సానికి ఓ ఇంట్లోని సోఫాసెట్‌ అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది చాలా ఎత్తులో ఎగురుతూ చక్కర్లు కొట్టింది. అలా ఎగురుకుంటూ వెళ్లి ఓ ఎత్తయిన భవనాన్ని బలంగా తాకింది.

ఇవి కూడా చదవండి

అవును, ఫిబ్రవరిలో భూకంపంతో విలవిల్లాడిన టర్కీ ఇప్పుడు భారీ వర్షాలు, ఈదురుగాలులతో వణికిపోతున్నది. దేశ రాజధాని అంకారాలో ఈదురు గాలుల ధాటికి ఏకంగా ఎంతో బరువైన సోఫాసెట్‌ ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సోఫా గాలిలో ఎగురుకుంటూ వస్తున్న వీడియో ఫుటేజీని గురు ఆఫ్‌ నథింగ్‌ అనే యూజర్‌ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంకారాలో కురిసిన తుఫాను వల్ల పలు సోఫాలు గాలిలో ఎగిరిపోతున్నాయంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే లక్షలాదిమంది వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..