Ponzi Scheme: పొదుపు పేరుతో భారీ స్కామ్ చేసిన దంపతులు.. ఏకంగా 12 వేల సంవత్సరాలు శిక్ష విధించిన కోర్టు ఎక్కడంటే

తమని నమ్మి భారీగా పెట్టుబడి పెట్టిన ప్రజలకు షాక్ ఇస్తూ.. హఠాత్తుగా బోర్డు తిప్పేశారు. ఇప్పుడు ఈ నిందితుల నేరం రుజువు కావడంతో పది జన్మలు ఎత్తినా సరే.. జైలు శిక్ష అనుభవించాలేమో అనే విధంగా 12,640 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ విచిత్ర తీర్పుని థాయిలాండ్ దేశానికి చెందిన కోర్టు వెలువరించింది.

Ponzi Scheme: పొదుపు పేరుతో భారీ స్కామ్ చేసిన దంపతులు.. ఏకంగా 12 వేల సంవత్సరాలు శిక్ష విధించిన కోర్టు ఎక్కడంటే
Ponzi Scam In Thailand
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2023 | 1:56 PM

పొదుపు పథకం, అప్పులు, సంపాదన ఇలా రకరకాల పేర్లతో మోసం చేసేవారు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా మోసాలు మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కువ అయ్యాయి. ఓ జంట తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని, తక్కువ సమయంలో లక్షాధికారులు కావచ్చు.. అందుకు మా దగ్గర ఉన్న మంచి పొదుపు పథకంలో చేరమని ఫేస్ బుక్ సహా ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఇందుకు కొన్ని వీడియోలు తయారు చేసి ప్రజలను ఆకర్షించారు. తమని నమ్మి భారీగా పెట్టుబడి పెట్టిన ప్రజలకు షాక్ ఇస్తూ.. హఠాత్తుగా బోర్డు తిప్పేశారు. ఇప్పుడు ఈ నిందితుల నేరం రుజువు కావడంతో పది జన్మలు ఎత్తినా సరే.. జైలు శిక్ష అనుభవించాలేమో అనే విధంగా 12,640 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ విచిత్ర తీర్పుని థాయిలాండ్ దేశానికి చెందిన కోర్టు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే..

థాయ్ లాండ్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రకారం..  పొదుపు పథకం పేరుతో ఆన్‌లైన్‌లో పోంజీ స్కీమ్‌ ద్వారా ప్రజలను మోసం చేసిన దంపతులకు కోర్టు శిక్ష విధించింది. ప్రజలకు అధిక డబ్బుని ఆశగా చూపి మోసం చేసిన దంపతుల్లో ఒక్కొక్కరికి 12,640 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

వాంటనీ తిప్పావెత్, మేతి చిన్ఫా పాంజీ దంపతులు 2019లో  ఆన్ లైన్ లో పోంజీ స్కీమ్‌ ద్వారా మోసానికి  తెర లేపారు. ప్రజలు తమ దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టడం కోసం ఆకర్షించే విధంగా తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని, స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంచి పథకంలో చేరాలంటూ ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. అయితే ఈ స్కామ్ లో ఈ దంపతులతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు ప్రముఖ పాత్రను పోషించారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ఈ దంపతులు 2019 లో మార్చి నుంచి అక్టోబర్ నెల మధ్యలో తమ స్కీమ్ నిజం అని నమ్మించేలా పోంజీ పథకం గురించి తెలియజేస్తూ రకరకాల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ సంస్థ  ‘నిజాయితీ’ గురించి ప్రజలను తెలియజేస్తూ తరచుగా నకిలీ వీడియోలను ఆన్ లైన్ లో ఉంచి ప్రలోభ పెట్టేవారు. తమకు వచ్చిన డబ్బులతో ఒక నగల దుకాణం కొన్నామంటూ రకరకాల బంగారు ఆభరణాలను ధరించి ఆ వీడియోలను షేర్ చేశారు.

అయితే ఆ నగల దుకాణం మాత్రమే కాదు ఆ నగలు నకిలీవని తేలింది. నిజానికి అది  జ్యూయెలరీ షాప్ కూడా కాదు. ఇది ఆఫీస్ లోని ఒక గదినే జ్యూయెలరీ షాప్ గా తయారు చేశారు. నగల షాప్ అనుకునే విధంగా నకిలీ వీడియోను తయారు చేవశారు.

ఈ వీడియోలు చూసి ఆకర్షితులైన ప్రజలు దాదాపు 2500 మందికి పైగా ఈ పోంజీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టారు. సుమారు 51.3 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా వచ్చిన తర్వాత ఈ దంపతులు బోర్డు తిప్పేశారు. తాము మోసపోయామని తెలుసుకున్న ప్రజలు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి విచారించారు. థాయ్ లాండ్ క్రిమినల్ కోర్టు వీరికి 12,640 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో ఈ శిక్షను 5,056 ఏళ్లకు తగ్గించింది. అయితే వాంటనీ తిప్పావెత్, మేతి చిన్ఫా పాంజీ దంపతులు  థాయ్ లాండ్ చట్టం ప్రకారం ఒక్కొక్కరు 20 ఏళ్లు మాత్రమే జైలు శిక్ష అనుభవిస్తారని తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..