Success Story: 22 ఏళ్లకే కోటీశ్వరుడైన హైస్కూల్ డ్రాపవుట్ యువకుడు.. ఇప్పుడు రిటైర్మెంట్ కూడా..

హైస్కూల్ డ్రాపవుట్  అయినా సరే ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న విద్యతో EcommSeason విద్యా సంస్థను ప్రారంభించాడు.హేడేన్ తన విద్యా సంస్థ ద్వారా సంపాదించిన డాలర్లను మళ్ళీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టాడు.

Success Story: 22 ఏళ్లకే కోటీశ్వరుడైన హైస్కూల్ డ్రాపవుట్ యువకుడు.. ఇప్పుడు రిటైర్మెంట్ కూడా..
Hayden Bowles
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2023 | 12:17 PM

చదువుకు జీవితంలో ఆర్ధికంగా ఎదగడానికి సంబంధం లేదని ఓ యువకుడు నిరూపించాడు. 17 ఏళ్లకు చదువు ఆపేశాడు.. అయితే కేవలం ఐదేళ్ళలో అంటే 22 ఏళ్లకు కోట్లకు అధిపతి అయ్యాడు. తాను ఏ పని చేయకపోయినా.. జీవితాంతం సుఖ సంతోషాలతో గడిచిపోయేలా డబ్బులను సంపాదించాడు. చిన్న వయసులోనే తక్కువ సమయంలోను సక్సెస్ సాధించిన యుఎస్ కు చెందిన యువకుడు.. స్ఫూర్తి వంతమైన స్టోరీ మీకోసం..

యుఎస్ కు చెందిన హేడేన్ బౌల్స్ 17 ఏళ్ల వయసులో చదువుకు గుడ్ బై చెప్పేశాడు. హైస్కూల్ డ్రాపవుట్  అయినా సరే ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న విద్యతో EcommSeason విద్యా సంస్థను ప్రారంభించాడు.హేడేన్ తన విద్యా సంస్థ ద్వారా సంపాదించిన డాలర్లను మళ్ళీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టాడు.

దీంతో హేడెన్ ఆదాయం రోజు రోజుకీ పెరగడం మొదలు పెట్టింది. సంపద రోజు రోజుకీ భారీగా చేరుకొని మిలియన్ కు చేరుకుంది. దీంతో హేడెన్ ఇక సంపాదన చాలు అనుకున్నాడు. దీంతో 60 ఏళ్ల వయసులో ఇక సంపాదన వద్దు అనుకుని ఆలోచించి రిటైర్మెంట్‌కి ప్లాన్ చేసే వారిలా ఈ యువకుడు ఆలోచించాడు. ఎందుకంటే ఇప్పడు తాను సంపాదించకపోయినా సరే జీవితాంతం సంతోషంగా గడిచిపోయే విధంగా డబ్బులను సంపాదించాడు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే హేడెన్ తన ఆన్ లైన్ విద్యా సంస్థతో $4 మిలియన్ల డాలర్లు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి $1.5 మిలియన్లను సంపాదించాడట. తనకు వచ్చిన డబ్బులతో ఆధునిక సౌకర్యాల ఇల్లు, లగ్జరీ కారు కొన్నాడు.  విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు తన సంస్థల ద్వారా సంపాదించిన డబ్బులను తన పార్టనర్‌తో కలిసి పంచుకున్నాడు.

ఎవరైనా హేడేన్ ను చదువు లేకపోయినా ఇంత చిన్న వయసులో సక్సెస్ ను ఎలా అందుకున్నావు.. ఇందులో రహస్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే.. వెంటనే హేడేన్ ”ఒక లక్ష్యంతో పని చేయండి.. చేసే పని ఏదైనా సరే మనసు పెట్టి పూర్తి చేయండి.. మీరు సంపాదించిన దానిలో పొదుపు చేయండి.. పొదుపు చేసిన దానిని మంచి లాభాలు తెచ్చే సంస్థల్లో పెట్టుబడి పెట్టండి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం సంపాదన మీదనే దృష్టి పెట్టాలని చెప్పాడు. చదువుతో సంబంధం లేకుండా ఒక లక్ష్యంతో పనిచేస్తూ జీవితంలో సక్సెస్ అందుకున్న 22 ఏళ్ల యువకుడు నేటి యువతకు నేటి తరానికి ఆదర్శం అని పలువురు కితాబిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ