Dead Body In Freezer: డబ్బు ఏపని అయినా చేయిస్తుందా..! వృద్ధుడి మృతదేహాన్ని రెండేళ్ళ పాటు ఫ్రీజర్‌లో పెట్టి..
బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ సిటీలో పొరుగింట్లో ఉంటున్న ఓ వృద్ధుడు చనిపోతే.. ఆ మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టాడో ఓ ప్రబుద్ధుడు. దాదాపు రెండేళ్ల పాటు ఫ్రీజర్ లోనే ఉంచిన విషయం బయటపడడంతో పోలీసులు కేసు పెట్టారు. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడని ఆరోపిస్తూ నిందితుడిని జైలుకు పంపారు.
మానవ బంధాలన్నీ వ్యాపార బంధాలే అన్న మాటను నిజం చేస్తున్నారు కొందరు వ్యక్తులు.. మానవత్వమా నీ చిరునామా ఎక్కడ అన్న ప్రశ్నలు మదిలో కదిలే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఓ సంఘటన. మరణించిన వృద్ధుని పెన్షన్ కోసం ఫ్రిడ్జ్ లో పెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ సిటీలో పొరుగింట్లో ఉంటున్న ఓ వృద్ధుడు చనిపోతే.. ఆ మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టాడో ఓ ప్రబుద్ధుడు. దాదాపు రెండేళ్ల పాటు ఫ్రీజర్ లోనే ఉంచిన విషయం బయటపడడంతో పోలీసులు కేసు పెట్టారు. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడని ఆరోపిస్తూ నిందితుడిని జైలుకు పంపారు. తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. వృద్ధుడి పెన్షన్ కోసమే నిందితుడు ఈ పని చేశాడని తేలింది. దీంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
బర్మింగ్ హామ్ లో 71 ఏళ్ల జాన్ వెయిన్ రైట్ నివసించేవారు. పొరుగింట్లో డేమియన్ జాన్సన్ తో స్నేహం పెంచుకున్నారు. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో 2018లో వెయిన్ రైట్ కన్నుమూశారు. వెయిన్ రైట్ కోసం వచ్చే బంధువులు ఎవరూ లేకపోవడంతో జాన్సన్ ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టాడు. వెయిన్ రైట్ బతికే ఉన్నట్లు అందరినీ నమ్మిస్తూ ఆయనకు నెల నెలా వచ్చే పెన్షన్ కాజేశాడు.
ఆ సొమ్ముతో షాపింగ్ చేస్తూ, హాయిగా కాలం గడిపాడు. దాదాపు రెండేళ్ల పాటు వెయిన్ రైట్ మృతదేహం అలాగే ఫ్రీజర్ లోనే ఉంచేశాడు. 2020 ఆగస్టులో మృతదేహం విషయం బయటకు పొక్కడంతో పోలీసులు జాన్సన్ ను అరెస్టు చేశారు. పెన్షన్ కోసమే మృతదేహాన్ని ఫ్రీజర్ లో దాచాడన్న ఆరోపణలను జాన్సన్ కొట్టిపారేశాడు. వెయిన్ రైట్ తో తనకు జాయింట్ అకౌంట్ ఉందని, టెక్నికల్ గా ఆ ఖాతాలోని సొమ్ము మొత్తం తనకే చెందుతుందని వాదిస్తున్నాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..