Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giant Rats: బ్రిటన్ లో 300 మిలియన్ ఎలుకలు.. ప్లేగు వ్యాధి పెరిగే అవకాశం ఉందని ఆందోళన

సహజ వనరుల సంస్థలో పర్యావరణ శాస్త్రవేత్త,  ప్రొఫెసర్ స్టీవ్ బాల్మాన్ మాట్లాడుతూ.. బ్రిటన్ లో 200 మిలియన్ల నుండి 300 మిలియన్ల ఎలుకలు ఉన్నట్లు తాను ఊహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఇక నుంచి అయినా ఎలుకల వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. 2018 సంవత్సరంలో  బ్రిటన్ లో అతిపెద్ద ఎలుక బోర్న్‌మౌత్‌లో పట్టుబడింది. దీని పొడవు 21 అంగుళాలు. అది చిన్న కుక్క సైజ్.

Giant Rats: బ్రిటన్ లో 300 మిలియన్ ఎలుకలు.. ప్లేగు వ్యాధి పెరిగే అవకాశం ఉందని ఆందోళన
Super Rats In Uk
Follow us
Surya Kala

|

Updated on: May 02, 2023 | 12:48 PM

ఓ వైపు మన దేశం పెరుగుతున్న జనాభాతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు గ్రేట్ బ్రిటన్ మాత్రం  పెరుగుతున్న ఎలుకల జనాభాతో ఇబ్బంది పడుతోంది. 300 మిలియన్ ఎలుకలు ఆ దేశంలో నానా భీభత్సం సృష్టిస్తున్నాయి. అంతేకాదు దేశంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరిగిందంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ఎలుకల పెరుగుదలకు ప్రధాన కారణం ఫాస్ట్ ఫుడ్. డస్ట్‌బిన్‌లో పడేస్తున్న ఆహారం ఎలుకలకు విందు అని.. ఆ విందు తిన్న తర్వాత ఎలుకలు బాగా లావు అయ్యాయి. దీంతో ఇక్కడ ఎలుకల బెడద పెద్ద సమస్యగా మారింది.

బ్రిటన్‌లో ఎలుకల సంఖ్య ఎందుకు పెరుగుతోందంటే?  1950ల నుంచి ఎలుకలను చంపేందుకు ఉపయోగిస్తున్న విషం.. ఎలుకల్లో వ్యాధి నిరోధకత పెరిగించేలా చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా.. ఎలుకల జనాభా గణనీయంగా పెరుగుతోంది. అంతేకాదు కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్‌ బ్రిటన్ వాసులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆహారం కూడా ఎలుకల పెరుగుదలకు ప్రధాన కారణం. అంతే కాదు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఎలుకలు రహస్య ప్రదేశాల్లోకి ప్రవేశించాయనే భయం కూడా వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గోడలు, నేలమాళిగల్లో సంతానోత్పత్తి చేస్తున్నాయి ఎలుకలు.

సమస్యగా మారిన ఎలుకలు  53 ఏళ్ల పెస్ట్ కంట్రోల్ నిపుణుడు క్రైగ్ మోరిస్ ఎలుకల పెరుగుదల గురించి హెచ్చరించాడు. బ్రిటన్‌లో ఎలుకలు అతి పెద్ద సమస్యగా మారుతున్నాయని చెప్పారు. ఎలుకలను నియంత్రించడానికి గత 15 సంవత్సరాలుగా హాంప్‌షైర్, డోర్సెట్ , విల్ట్‌షైర్‌లలో పనిచేస్తున్నాడు. ప్రకృతిని అద్భుతంగా బ్రతికించే వాటిలో ఎలుకలు ఒకటని ఆయన అన్నారు.  అనేకాదు ఎలుకలు మానవులు చేసే ప్రతి పనిని సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ఉపయోగించుకుంటున్నాయి. మానవులు ఎంత ఎక్కువ ఆహారాన్ని వృధా చేస్తారో.. అదే ఎలుకలకు ఆహార లభ్యతకు కారణం అంటూ చెప్పారు. అంతేకాదు మురికి, అపరిశుభ్రత కారణంగా ఎలుకలు కూడా పెరుగుతున్నాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

బ్రిటన్‌లో 21 అంగుళాల ఎలుక  అదే సమయంలో లండన్ లోని గ్రీన్విచ్ విశ్వవిద్యాలయానికి చెందిన సహజ వనరుల సంస్థలో పర్యావరణ శాస్త్రవేత్త,  ప్రొఫెసర్ స్టీవ్ బాల్మాన్ మాట్లాడుతూ.. బ్రిటన్ లో 200 మిలియన్ల నుండి 300 మిలియన్ల ఎలుకలు ఉన్నట్లు తాను ఊహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఇక నుంచి అయినా ఎలుకల వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. 2018 సంవత్సరంలో  బ్రిటన్ లో అతిపెద్ద ఎలుక బోర్న్‌మౌత్‌లో పట్టుబడింది. దీని పొడవు 21 అంగుళాలు. అది చిన్న కుక్క సైజ్. అయితే ఇప్పుడు బ్రిటన్‌లోని మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్ సమీపంలోని డస్ట్‌బిన్‌లో కనిపించిన ఎలుకలలో ఏడు చాలా పెద్దవని పేర్కొన్నారు.

బ్రిటన్‌లో ఎలుకలు విధ్వంసం  ఎలుకలకు దంతాలు బలంగా ఉక్కులా ఉంటాయి. ఇవి కాంక్రీటును కూడా నమలగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఎలుకలు చాలా తెలివైనవారని.. అవి మన ఇళ్లకు చేరుకోవడానికి మనస్సులో మ్యాప్‌ను తయారు చేసుకుంటాయని వెల్లడించారు. వీటి శరీరం చాలా సరళంగా ఉంటుంది. అందుకే ఈ ఎలుకలు టాయిలెట్ పైపు U- బెండ్ చుట్టూ తమను తాము చుట్టుకుంటాయని తెలిపారు. గత నెలలో, వెల్ష్ బీచ్ ఆఫ్ టెన్బీ తీరం దగ్గర ఉన్న నివాసితులు తాము పెద్ద పిల్లి లాంటి ఎలుకలు సముద్రపు శిఖరాల దగ్గర చూసినట్లు వెల్లడించారని గుర్తు చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..