America: గన్‌ కల్చర్‌కు చెక్‌ పెట్టేందుకు వినూత్న ఆఫర్‌.. ‘గన్‌ ఇవ్వండి.. గిఫ్ట్‌ కార్డు తీసుకోండి’

అమెరికాలో గన్ కల్చర్‌పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్‌ పెట్టేందుకు అమెరికాలోని న్యూయార్క్‌ నగరం వినూత్న ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న తుపాకులను ఇస్తే విలువైన గిఫ్ట్‌ కార్డులు ఇస్తామని శనివారం..

America: గన్‌ కల్చర్‌కు చెక్‌ పెట్టేందుకు వినూత్న ఆఫర్‌.. 'గన్‌ ఇవ్వండి.. గిఫ్ట్‌ కార్డు తీసుకోండి'
Guns Exchange Programme in USA
Follow us
Srilakshmi C

|

Updated on: May 02, 2023 | 10:09 AM

అమెరికాలో గన్ కల్చర్‌పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్‌ పెట్టేందుకు అమెరికాలోని న్యూయార్క్‌ నగరం వినూత్న ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న తుపాకులను ఇస్తే విలువైన గిఫ్ట్‌ కార్డులు ఇస్తామని శనివారం ప్రకటించింది. ఈ మేరకు న్యూయార్క్‌ నగర వ్యాప్తంగా 9 కేంద్రాలను ఏర్పాటు చేసింది. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తొలిరోజే అనూహ్య స్పందన వచ్చింది. వేల మంది పౌరులు ముందుకొచ్చి తమ వద్ద ఉన్న ఆయుధాలను అధికారులకు అప్పగించారు. ఇలా ఆదివారం ఒక్కరోజే అమెరికా పౌరులు తమ వద్ద ఉన్న 3,076 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 185 భారీ ఆయుధాలు ఉన్నాయి.

మొదటి ఆయుధాన్ని అప్పగించిన వారికి 500 డాలర్ల వరకు గిఫ్ట్ కార్డు, ఆపై ప్రతి ఆయుధానికి 150 డాలర్ల మేర గిఫ్ట్ కార్డులు అందజేశారు. హ్యాండ్ గన్, అసాల్ట్ రైఫిల్, ఘోస్ట్ గన్, షాట్ గన్, 3డీ ప్రింటెడ్ గన్ ఇలా రకరకాల ఆయుధాలను సరెండర్‌ చేశారు. సిరాక్యూజ్ నగరం నుంచి అత్యధికంగా 751 ఆయుధాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 5 వేల డాలర్ల వరకు అందుకున్నాట్లు వెల్లడించాడు. బ్రూక్లిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తొలి మూడు గంటల్లోనే 90 తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. తుపాకీ హింస నుంచి న్యూయార్క్ వాసులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, స్వాధీనం చేసుకన్న ప్రతి గన్‌ వల్ల ఒక్కో విషాదాన్ని నిర్మూలించినట్లువుతుందని అధికారులు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.