Indian Railways: సీనియర్‌ సిటిజన్ల రాయితీల రద్దుతో రైల్వేకు రూ.2,242 కోట్ల లాభం

సీనియర్‌ సిటిజన్ల టికెట్‌ రాయితీ రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖకు భారీగా ఆదాయం ముట్టింది. దీని ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు రూ.2,242 కోట్లు అదనంగా ఆర్జించినట్లు వెల్లడించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ దాఖలు చేసిన దరఖాస్తుకు..

Indian Railways: సీనియర్‌ సిటిజన్ల రాయితీల రద్దుతో రైల్వేకు రూ.2,242 కోట్ల లాభం
Senior Citizen Ticket Concession
Follow us
Srilakshmi C

|

Updated on: May 02, 2023 | 7:30 AM

సీనియర్‌ సిటిజన్ల టికెట్‌ రాయితీ రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖకు భారీగా ఆదాయం ముట్టింది. దీని ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు రూ.2,242 కోట్లు అదనంగా ఆర్జించినట్లు వెల్లడించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ దాఖలు చేసిన దరఖాస్తుకు ఈ మేరకు రైల్వే అధికారులు తెలియజేశారు.

కాగా ఇండియన్‌ రైల్వే గతంలో 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు 50 శాతం చొప్పున టికెట్‌ ధరలో రాయితీ ఇచ్చేది. ఏటా రైల్వే ఇచ్చే రాయితీల్లో ఈ వాటానే దాదాపు 80 శాతంగా ఉండేది. అయితే కరోనా నేపథ్యంలో ఈ రాయితీని కేంద్రం తొలగించింది. ఇప్పటి వరకు దానిని తిరిగి పునరుద్ధరించలేదు. సీనియర్‌ సిటిజన్ల టికెట్ల రూపంలో ఈ ఏడాది కాలంలో మొత్తం రూ.5,062 కోట్ల ఆదాయం సమకూరింది. రాయితీ రద్దు ద్వారా రూ.2,242 కోట్ల అదనపు ఆదాయం రైల్వేకు వచ్చింది. పురుష వయో వృద్ధుల నుంచి రూ.2891 కోట్లు, మహిళా సీనియర్‌ సిటిజన్ల నుంచి నుంచి రూ.2,169 కోట్లు, ట్రాన్స్‌జెండర్ల నుంచి రూ.1.03 కోట్లు చొప్పున ఆదాయం రైల్వేకు సమకూరినట్లు అధికారులు సమాచారం అందించారు.

ఇదిలా ఉంటే మరోవైపు సీనియర్‌ సిటిజన్ల రాయితీని పునరుద్ధరించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాయితీ పునరుద్ధరణకు కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేయగా.. దాన్ని ధర్మాసనం కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!