Bhiwandi building collapse: బిల్డింగ్‌ కుప్పకూలిన ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్

మహారాష్ట్ర థానే జిల్లా భివండిలోని వల్పాడ ప్రాంతంలో శనివారం (ఏప్రిల్ 29) రెండంతస్తుల గోడౌన్ ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా.. 12 మందిని రెస్క్యూ టీం కాపాడింది. భవనం శిథిలాల కింద చిక్కుకున్న మిగతా క్షతగాత్రులను రక్షించేందుకు 2 రోజులుగా సహాయక చర్యలు..

Bhiwandi building collapse: బిల్డింగ్‌ కుప్పకూలిన ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్
Bhiwandi Building Collapse
Follow us
Srilakshmi C

|

Updated on: May 01, 2023 | 9:59 AM

మహారాష్ట్ర థానే జిల్లా భివండిలోని వల్పాడ ప్రాంతంలో శనివారం (ఏప్రిల్ 29) రెండంతస్తుల గోడౌన్ ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా.. 12 మందిని రెస్క్యూ టీం కాపాడింది. భవనం శిథిలాల కింద చిక్కుకున్న మిగతా క్షతగాత్రులను రక్షించేందుకు 2 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మరో నాలుగు మృత దేహాలను వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఆదివారం ఉదయం శిథిలాల కింది నుంచి సునీల్ పిసా(38) అనే వ్యక్తిని వెలికితీశారు. తీవ్రగాయాలపాలైన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకో 15 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని థానె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. బిల్డింగ్ ఓనర్ ఇంద్రపాల్ పాటిల్‌పై కేసు నమోదు చేసినట్లు భివండి పోలీసులు తెలిపారు.

కాగా శనివారం జరిగిన ఈ ఘటనలో మొదటి అంతస్తులోని గోడౌన్లలో పనిచేస్తున్న కార్మికులతో సహా పై అంతస్తులో ఉంటున్న 4 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఆరుగురు చనిపోగా మరో 12 మందికి గాయాలయ్యాయి. బిల్డింగ్ కూలిన ప్రాంతాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ షిండే శనివారం పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం, గాయపడినవాళ్ల ఆస్పత్రి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.