800 ఏళ్ల నాటి ఈ శివాయంలో మహిళలే పూజారులు.. తరాలుమారినా మారని సంప్రదాయం

మన దేశంలోని ఏ ప్రాంతంలోనోనైనా.. ఏ దేవాలయంలోనైనా.. పూజాది కార్యక్రమాలు నిర్వహించేది పురుష అర్చకులు మాత్రమే. వేల యేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. మహిళలు పూజారులుగా వ్యవహరించడం చాలా అరుదు..

800 ఏళ్ల నాటి ఈ శివాయంలో మహిళలే పూజారులు.. తరాలుమారినా మారని సంప్రదాయం
Women Priest
Follow us

|

Updated on: May 01, 2023 | 7:46 AM

మన దేశంలోని ఏ ప్రాంతంలోనోనైనా.. ఏ దేవాలయంలోనైనా.. పూజాది కార్యక్రమాలు నిర్వహించేది పురుష అర్చకులు మాత్రమే. వేల యేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. మహిళలు పూజారులుగా వ్యవహరించడం చాలా అరుదు. గుజారాత్‌లోని సూరత్‌లో కతర్‌గామ్‌ ప్రాంతంలో ఉన్న 800 ఏళ్లనాటి మహదేవ్‌ ఆలయంలో మాత్రం తరతరాలుగా మహిళలే పూజారులుగా కొనసాగుతున్నారు.

ఎనిమిది తరాలకు పైగా ఈ ఆలయంలో స్త్రీలు వారసత్వంగా పూజారులుగా వ్యవహరిస్తున్నారు. పుని స్త్రీలు మాత్రమే కాదు.. వితంతువులు కూడా ఈ దేవాలయంలో పూజారులుగా వ్యవహరించడం విశేషం. ప్రస్తుతం ఈ దేవాలయంలో రక్షాబెన్ గోస్వామి (63) అనే మహిళ పూజారిగా వ్యవహరిస్తున్నారు. క్షాబెన్ గోస్వామి భర్త, కుమారుడు గుండెపోటుతో మరణించారు. వితంతువైనప్పటికీ రక్షాబెన్, ఆమెతోపాటు ఆమె కోడలు పూనంబన్‌ కూడా ఆలయంలో పూజలు చేస్తున్నారు.

42 ఏళ్ల నుంచి మహాదేవుని సేవలో తరిస్తున్న రక్షాబెన్‌.. ఆమె అత్తగారి నుంచి ఆలయ సేవను వారసత్వంగా పొందినట్లు తెలిపారు. ఈ ఆలయంలో సోమనాథ్‌ మహదేవ్‌, కామనాథ్‌ మహదేవ్‌ అని రెండు శివలింగాలు దర్శనమిస్తాయి. పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శ్రావణ మాసం, శివరాత్రి వంటి పర్వదినాలలో కూడా ఆ అత్తాకోడళ్లు పూజలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.