Telangana High Court: దళిత మహిళ అత్యాచారం కేసులో ఆ ముగ్గురికి ఉరి శిక్ష రద్దు.. ‘ఊపిరున్నంత వరకు జైళ్లోనే’

దళిత మహిళ అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన ఘటనలో ముగ్గురు దోషులకు ఆసిఫాబాద్ ప్రత్యేక కోర్టు విధించిన మరణ శిక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. అయితే వారికి 14 ఏండ్ల యావజ్జీవ శిక్ష కాకుండా మరణించేంత వరకు జైళ్లోనే ఉండాలని జీవిత ఖైదు విధించింది. వారు ఏ విధమైన క్షమాభిక్షకు అర్హులు కాదని హైకోర్టు తీర్పు..

Telangana High Court: దళిత మహిళ అత్యాచారం కేసులో ఆ ముగ్గురికి ఉరి శిక్ష రద్దు.. 'ఊపిరున్నంత వరకు జైళ్లోనే'
Telangana High Court
Follow us

|

Updated on: Apr 30, 2023 | 12:20 PM

దళిత మహిళ అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన ఘటనలో ముగ్గురు దోషులకు ఆసిఫాబాద్ ప్రత్యేక కోర్టు విధించిన మరణ శిక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. అయితే వారికి 14 ఏండ్ల యావజ్జీవ శిక్ష కాకుండా మరణించేంత వరకు జైళ్లోనే ఉండాలని జీవిత ఖైదు విధించింది. వారు ఏ విధమైన క్షమాభిక్షకు అర్హులు కాదని హైకోర్టు తీర్పు సమయంలో వ్యాఖ్యానించింది.

ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళపై 2019 నవంబర్‌ 24న షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మక్దూమ్‌ అనే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్జన ప్రదేశానికి బాధితురాలిని లాక్కువెళ్లి, అత్యాచారం చేసి, అనంతరం గొంతునులిమి హత్య చేశారు. ఈ కేసులో నిందితులకు ఆసిఫాబాద్‌ ప్రత్యేక కోర్టు హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టంలోని పలు సెక్షన్ల కింద 2020లో ఉరిశిక్ష విధించింది. దీనిపై దోషులు జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు రిపర్‌ ట్రయల్‌ పిటిషన్‌ (RT) పెట్టుకున్నారు. జస్టిస్‌ పి నవీన్‌రావు, జస్టిస్‌ జువ్వాది శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి, తీర్పు వెలువరించింది. కింది కోర్టు వేసిన ఉరిశిక్షను జీవిత కారాగార శిక్షగా మారుస్తూ తీర్పు ఇచ్చింది.

తుది శ్వాస విడిచే వరకు దోషులు జైల్లోనే జీవితం గడపాలి. వారు క్షమాభిక్షకు అనర్హులు. ఈ ముగ్గురూ ఘోరమైన నేరానికి పాల్పడ్డారు. ఇలాంటి వారి వాళ్ల సమాజానికి ముప్పు తలెత్తుతుంది. అటువంటి ప్రమాదం నుంచి సమాజాన్ని కోర్టు కాపాడాలి. కాబట్టి వారిని సమాజంలో తిరగనివ్వకూడదు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా నిరోధించాలి. వీరికి మరణ శిక్ష విధిస్తే.. నేరస్థులను సంస్కరించే ప్రాథమిక కర్తవ్యాన్ని సమాజం, ప్రభుత్వం విస్మరించినట్లవుతుందని’ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..