అమెరికా వైట్ హౌస్.. తెలంగాణ సెక్రటేరియట్ మధ్య తేడాలు ఇవే.. ప్రత్యేకతలు ఏంటంటే..?

వైట్ హౌస్ ను తలపించేలా కొత్త సెక్రెరియేట్ భవనాన్ని ఆరు అంతస్తులతో నిర్మించారు. సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ఎసి కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్‌ను నెలకొల్పారు. 30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలు, 24 లిఫ్ట్‌లను, అన్ని రకాల అవసరాల కోసం 5.60 లక్షల లీటర్ల నిల్వ ఉండేలా ట్యాంకులను ఏర్పాటు చేశారు. కరెంట్ పొదుపునకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Shaik Madar Saheb

|

Updated on: Apr 30, 2023 | 1:08 PM

తెలంగాణ ఆత్మగౌరవ దీపిక, అస్తిత్వ వైభవానికి అద్భుతమైన ప్రతీక.. అమెరికా వైట్ హస్ ను తలపించేలా నిర్మించిన కొత్త సచివాలయ భవనం ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆసీనులవుతారు. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇంత ఎత్తైన, ఈ తరహా సచివాలయం దేశంలో ఎక్కడా లేదు. భవనం పైన ఏర్పాటుచేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్‌ను సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్ కార్డ్‌ పాస్‌లు జారీ చేయనున్నారు. 300 సిసి కెమెరాలు, 300 మంది పోలీసులతో నిఘాను ఏర్పాటు చేయనున్నారు.

1 / 10
వైట్ హౌస్ ను తలపించేలా కొత్త సెక్రెరియేట్ భవనాన్ని ఆరు అంతస్తులతో నిర్మించారు.  సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ఎసి కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్‌ను నెలకొల్పారు. 30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలు, 24 లిఫ్ట్‌లను, అన్ని రకాల అవసరాల కోసం 5.60 లక్షల లీటర్ల నిల్వ ఉండేలా ట్యాంకులను ఏర్పాటు చేశారు. కరెంట్ పొదుపునకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. సచివాలయం ముందువైపు రెండు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఎటిఎం సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్‌లు ఉన్నాయి. వెనుకవైపు ఉద్యోగుల అసోసియేషన్, ఇండోర్ గేమ్స్, హౌసింగ్ సొసైటీ కార్యాలయాల కోసం నాలుగు అంతస్తులతో ఒక బిల్డింగ్‌ను నిర్మించారు.

2 / 10
సచివాలయంపై నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆహ్లాదకరంగా ఉండేందుకు సచివాలయం ముందు, భవనం మధ్య భాగంలో గ్రీనరీని సైతం ఏర్పాటు చేశారు. ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటు చేసిన అశోకుడి చిహ్నం నేలపై నుంచి 265 అడుగుల ఎత్తులో ఉంది. 2వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా ఈ నూతన సచివాలయాన్ని నిర్మించారు. సౌత్ వెస్ట్ వైపు ఆలయం, మసీదు, చర్చిలను నిర్మించారు.

3 / 10
సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్ యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. ఆరో అంతస్తులోని సిఎంఓకు చేరుకునేందుకు రెండు లిప్టులను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను రూపొందించారు.

4 / 10
విదేశీ ప్రతినిధులు, ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హై టీ, రాయల్ డిన్నర్‌లకు వినియోగిస్తారు. అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించోచ్చు. ఈ ప్రాంతాన్ని స్కై లాంజ్ గా పేర్కొంటారు. పార్లమెంట్ భవనానికి వినియోగించిన ధోల్ పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3,500 క్యూ.మీ. పరిమాణంలో వినియోగించారు.

5 / 10
కాగా.. అమెరికా వైట్ హౌస్ తో పోలిస్తే.. తెలంగాణ నూతన సచివాలయం అత్యధిక విస్తీర్ణంలో నిర్మించారు. పూర్వం (1810–1901) ఎగ్జిక్యూటివ్ మాన్షన్, వాషింగ్టన్, DC లోని 1600 పెన్సిల్వేనియా అవెన్యూ NW వద్ద యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుని అధికారిక కార్యాలయం, నివాసం (వైట్ హౌస్) ను నిర్మించారు. బహుశా ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన, సులభంగా గుర్తించదగిన భవనం, ఇది రెండూగా సేవలందిస్తుంది. ప్రెసిడెంట్ ఇల్లు, కార్యాలయం, అధ్యక్షుడి ప్రధాన సిబ్బంది ప్రధాన కార్యాలయం కూడా ఉంటుంది.

6 / 10
వైట్ హౌస్ ను 18 ఎకరాలు (7.2 హెక్టార్లు) లో నిర్మించారు. న్యూయార్క్, ఫిలడెల్ఫియాలో అధ్యక్ష నివాసాలను ఆక్రమించిన జార్జ్ వాషింగ్టన్ (1789-97) పరిపాలన నుంచి పరిపాలనను కొనసాగిస్తోంది. ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్‌లో నివసించడం.. అక్కడినుంచే పాలన అందించడం అనావయితీగా వస్తోంది. ప్రారంభ మ్యాప్‌లలో వాస్తవానికి "ప్రెసిడెంట్స్ ప్యాలెస్" అని పిలిచేవారు. ఈ భవనానికి అధికారికంగా 1810లో రాయల్టీ అర్థాలను నివారించడానికి ఎగ్జిక్యూటివ్ మాన్షన్ అని పేరు పెట్టారు.

7 / 10
"వైట్ హౌస్" అనే పేరు సాధారణంగా అదే సమయం నుంచి ఉపయోగించినప్పటికీ (భవనం యొక్క తెలుపు-బూడిద ఇసుకరాయి సమీపంలోని భవనాల ఎర్ర ఇటుకతో చాలా భిన్నంగా ఉంటుంది). ఇది 1901 వరకు భవనం అధికారిక పేరుగా మారలేదు. ఇన్నేళ్ల చరిత్రలో ఒకసారి శత్రు సైనికుల దాడికి ధ్వంసమైంది. అగ్నిప్రమాదం, వరదలు ఎదుర్కొంది. దీని నిర్వహణకు ఏటా అయ్యే ఖర్చు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు. ఓసారి ఇది కాలిపోయినప్పుడు మరమ్మతుల కోసం తెల్లరంగు వేశారు. అప్పట్నుంచి వైట్‌హౌస్‌ అనేవారు. అధికారికంగా 1901లో అప్పటి అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ ఆ పేరును ఉపయోగించడం మొదలుపెట్టారు.

8 / 10
ఆరు అంతస్తులుగల ఈ భవనం ఉన్న స్థలం కంచెతో కలిపి మొత్తం 18 ఎకరాలు. భవనం లోపల నిర్మాణస్థలం 55,000 చదరపు అడుగులు. ఉగ్రవాదుల భయంతో ఇప్పుడు అనుమతించడం లేదు. అంతకు మునుపు రోజూ దీన్నీ చూడ్డానికి ఆరువేల మంది వచ్చేవారు. వైట్‌హౌస్‌ నిర్మాణాన్ని 1792లో మొదలు పెట్టి ఎనిమిదేళ్ల పాటు కొనసాగించారు. దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు 13 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆ తర్వాత మార్పులు చేస్తూ వచ్చారు.

9 / 10
వైట్‌హౌస్‌ భూగర్భంలో ఓ బంకర్‌, అత్యవరసర పరిస్థితుల్లోఅధ్యక్షుడు ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించడానికి అత్యాధునిక సౌకర్యాలు, సొరంగమార్గాలు ఉన్నాయి. వైట్‌హౌస్‌లో మొత్తం 132 గదులు, 142 తలుపులు, 147 కిటికీలు, ఒకేసారి140 మంది కూర్చునేలా డైనింగ్‌ టేబుల్‌, నిర్వహణకు 5,700 మంది ఉద్యోగులున్నారు.

10 / 10
Follow us