Best Mileage Bikes: రూ. లక్షలోపు ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే.. ఒక్క లీటర్‌కు 80 కిమీ..!

మనం కొత్తగా బైక్ కొనేటప్పుడు.. ముందుగా చూసుకోవాల్సింది మైలేజ్. ఎక్కువ డబ్బులు వెచ్చించి బైకులు కొనుగోలు చేసినప్పటికీ.. చాలా టూ వీలర్స్ తక్కువ మైలేజ్ అందిస్తున్నాయి.

Ravi Kiran

|

Updated on: Apr 30, 2023 | 11:15 AM

ప్రస్తుతం బైక్ అనేది మనలో ఒక భాగమైపోయింది. ప్రభుత్వ రవాణా బదులుగా చాలామంది వ్యక్తులు బైకులపైనే ఆఫీసులకు గానీ.. వేరే ప్రాంతాలకు గానీ వెళ్తున్నారు. అయితే మనం కొత్తగా బైక్ కొనేటప్పుడు.. ముందుగా చూసుకోవాల్సింది మైలేజ్. ఎక్కువ డబ్బులు వెచ్చించి బైకులు కొనుగోలు చేసినప్పటికీ.. చాలా టూ వీలర్స్ తక్కువ మైలేజ్ అందిస్తున్నాయి. మరి రూ. లక్షలోపు బెస్ట్ మైలేజ్ అందించే టాప్ 5 బైకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?

1 / 6
హీరో స్ప్లెండర్ ప్లస్:   దేశంలో అత్యంత విజయవంతమైన టూ వీలర్స్‌లో హీరో స్పెండర్ ప్లస్ ఒకటి. ఇది 97.2 cc ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, OHC ఇంజిన్‌తో 7.91 bhp, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 80 కిమీ ఇస్తుంది. దీని ధర రూ. 71,586 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

2 / 6
బజాజ్ ప్లాటినా 100:   ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లలో ఈ  బజాజ్ ప్లాటినా 100 కూడా ఒకటి. ఈ మోటార్‌సైకిల్ 7.79 బిహెచ్‌పి, 8.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 102 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటర్‌కు 70 kmpl అందిస్తుంది. కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే ఈ బైక్ అందుబాటులో ఉండగా.. దీని ప్రారంభ ధర రూ. 65,856 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

3 / 6
టీవీఎస్ సపోర్ట్:   ఈ బైక్ లీటర్‌కు 70 కిమీ ఇస్తుంది. టూ వీలర్స్ తయారు చేసే ప్రముఖ సంస్థ టీవీఎస్ నుంచి వచ్చిన అత్యంత ఇంధన సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలలో ఒకటి. ఇది 7350 rpm @ 8.29 bhp, 4500 rpm వద్ద 8.7 Nm శక్తిని ఉత్పత్తి చేసే 109 cc ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇంజిన్ 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో జత చేయబడింది. ఈ మోటార్‌సైకిల్ కిక్ స్టార్ట్ వేరియంట్‌ ధర రూ. 64,050 కాగా,  సెల్ఫ్-స్టార్ట్ వేరియంట్ ధర రూ. 70,223(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

4 / 6
టీవీఎస్ రాడాన్:   క్లాక్, సర్వీస్ ఇండికేటర్, లో- బ్యాటరీ ఇండికేటర్, టాప్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ లాంటివి చూపించే LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అదనపు ఫీచర్లను జోడించి TVS సంస్థ గత ఏడాది Radeon సరికొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ బైక్ 7,000 rpm వద్ద 8 bhp, 5,000 rpm వద్ద 8.7 Nm గరిష్ట టార్క్ ట్యూన్ చేయబడిన 109.7 cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ నుంచి శక్తిని పొందుతుంది. ఇది 65-70 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ బేస్ ఎడిషన్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 60,925. అటు డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ. 74 834 కాగా, డిజి డిస్క్ వేరియంట్ రూ. 78 834(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

5 / 6
బజాజ్ సిటీ110:   అత్యధిక మైలేజ్ అందించే బైకుల్లో బజాజ్ CT110 ఒకటి. 8.48 bhp, 9.81 Nm శక్తిని విడుదల చేసే 115 cc ఇంజిన్ ద్వారా ఈ  బైక్ 70 kmpl అందిస్తుంది. దీని ముందు వెనుక డ్రమ్ బ్రేక్‌లతో పాటు LED హెడ్‌ల్యాంప్‌లను అమర్చబడి ఉన్నాయి. ఈ బైక్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. దీని ధర రూ. 67,322 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

6 / 6
Follow us