Secunderabad: సికింద్రాబాద్‌లో ఘోర విషాదం.. నాలాలోపడి 11 ఏళ్ల బాలిక మృతి

పాలప్యాకెట్‌ కోసం వెళ్లిన పదకొండేళ్ల బాలికను నాలా మింగేసింది. తొలుత ప్రమాదవశాత్తు నాలాలో పడిబోయిన అన్నను బాలిక కాపాడింది. ఐతే వర్షం నీళ్లలో తన ముందున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది. పక్కనే గోతిలో అడుగు పెట్టి నాలాలోకి జారిపడి, మృత్యు ఒడిలోకి చేరింది. ఈ హృదయ విదారక ఘటన సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీసుస్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం..

Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 30, 2023 | 3:18 PM

పాలప్యాకెట్‌ కోసం వెళ్లిన పదకొండేళ్ల బాలికను నాలా మింగేసింది. తొలుత ప్రమాదవశాత్తు నాలాలో పడిబోయిన అన్నను బాలిక కాపాడింది. ఐతే వర్షం నీళ్లలో తన ముందున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది. పక్కనే గోతిలో అడుగు పెట్టి నాలాలోకి జారిపడి, మృత్యు ఒడిలోకి చేరింది. ఈ హృదయ విదారక ఘటన సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీసుస్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సికింద్రాబాద్‌లోని కళాసీగూడ ధన్‌బజార్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, రేణుక దంపతులకు కార్తిక్‌ (15), మౌనిక (11) సంతానం. శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతుండటంతో భార్య రేణుక ఇంటి వద్దే చిన్న పచారీ దుకాణం నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొడుకు కార్తిక్‌ మానసిక దివ్యాంగుడు. కుమార్తె మౌనికను పాల ప్యాకెట్‌ తీసుకురమ్మని తల్లి రేణుక శనివారం ఉదయం చెప్పింది. మౌనికతోపాటు తాను కూడా వెళ్తానని కార్తిక్‌ చెప్పడంతో తల్లి ఇద్దరినీ బయటకు పంపింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కళాసీగూడ ప్రభుత్వ పాఠశాల వద్ద పెద్దఎత్తున నీరు వచ్చి చేరింది. అన్నచెల్లి ఇద్దరూ అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. సీసీ రోడ్డు కోసం తవ్వి ఉంచడం వల్ల వర్షం నీటితో ఆ గొయ్యి నిండిపోయింది.

అటుగా వెళ్లున్న కార్తిక్‌ తొలుత అందులో అడుగుపెట్టి కింద పడిపోయాడు. మౌనిక అన్నను లేపి నిలబెట్టింది. రెండు అడుగులు వేసే క్రమంలో తనూ గోతిలో పడిపోయింది. నీటి వేగానికి గుంత నుంచి నేరుగా నాలాలోకి జారిపోయింది. స్థానికులు రక్షించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానికులు మహంకాళి ఠాణా పోలీసులకు సమాచారం అందించారు. వారు జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బందితో కలిసి వచ్చి నాలాలో గాలింపు చర్యలు చేపట్టారు. అర కిలోమీటరు దూరంలో ఓ మ్యాన్‌హోల్‌ వద్ద మౌనిక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. దీంతో కుమార్తె మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. జీహెచ్‌ఎమ్‌సీ మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని బాలిక కుటుంబానికి రూ.2 లక్షలు ఎక్స్-గ్రేషియా అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం