AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్స్‌ కేసులో జైలు నుంచి విడుదలైన నటి ‘సర్ఫ్‌తో తల స్నానం చేశా.. టాయిలెట్‌ వాటర్‌తో చేసిన కాఫీ తాగా..’

డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా (27) జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నటి పెరీరాను పోలీసులు ఈ నెల 1న షార్జాలో అరెస్టు చేశారు. 26 రోజుల రిమాండ్‌ అనంతరం బుధవారం (ఏప్రిల్ 26) సాయంత్రం పెరీరా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా తన జైలు జీవితం గురించి వివరిస్తూ బాధ పడ్డారు..

డ్రగ్స్‌ కేసులో జైలు నుంచి విడుదలైన నటి 'సర్ఫ్‌తో తల స్నానం చేశా.. టాయిలెట్‌ వాటర్‌తో చేసిన కాఫీ తాగా..'
Chrisann Pereira Drug Case
Srilakshmi C
|

Updated on: Apr 30, 2023 | 6:31 AM

Share

డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా (27) జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నటి పెరీరాను పోలీసులు ఈ నెల 1న షార్జాలో అరెస్టు చేశారు. 26 రోజుల రిమాండ్‌ అనంతరం బుధవారం (ఏప్రిల్ 26) సాయంత్రం పెరీరా జైలు నుంచి విడుదలయ్యారు.  సోషల్‌ మీడియా వేదికగా తన జైలు జీవితం గురించి వివరిస్తూ నటి బాధ పడ్డారు.

‘డియర్ వారియర్స్.. శత్రువులకు కూడా జైలు గతి పట్టాలని కోరుకోకూడదు. నేను జైలులో ఉన్న ఈ 26 రోజులు నరకం అనుభవించాను. చుట్టూ తెలియని వాళ్లు.. నాలుగు గోడల మధ్య ఎలా గడిపానో నాకే తెలుసు. నాకు పెన్, పేపర్ దొరకడానికే మూడు వారాలు పట్టింది. టైడ్ సర్ప్‌తో తల స్నానం చేశాను. టాయిలెట్ వాటర్‌తో చేసిన కాఫీ తాగానంటూ’ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఐతే పథకం ప్రకారమే పెరీరాను ఈ కేసులో ఇరికించారని, దీనివెనుక పెద్ద కుట్ర జరిగిందని ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే అసలు నిందితులు ఆంథోనీ పాల్‌, అతని సన్నిహితుడు రాజేష్‌ బబొటేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌ పోర్టుకు వెళ్తుండగా పెరీరాకు పాల్‌ డ్రగ్స్‌ దాచిన ట్రోఫీని నటికి అందించారు. అనంతరం అధికారుల తనిఖీల్లో ట్రోఫీలో డ్రగ్స్‌ బయటపడటంతో నటిని అరెస్టు చేశారు. ఇదే తరహాల్లో మరో నలుగురిని కూడా నిందితుడు పాల్‌ డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కాగా క్రిసాన్ పెరీరా సడక్‌ 2, బట్లా హౌస్‌ వంటి పలు బాలీవుడ్‌ మువీలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!