కదులుతున్న ప్యాసింజర్‌ రైలులో మంటలు.. ఏడుగురు సజీవదహనం

పాకిస్థాన్‌లో గురువారం (ఏప్రిల్‌ 27) ఘోర ప్రమాదం జరిగింది. రాత్రిపూట కదులుతున్న ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్యాసింజర్‌ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు ఏడుగురు సజీవదహనమయ్యారు..

కదులుతున్న ప్యాసింజర్‌ రైలులో మంటలు.. ఏడుగురు సజీవదహనం
Pakistan Passenger Train Fire Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 28, 2023 | 7:48 AM

పాకిస్థాన్‌లో గురువారం (ఏప్రిల్‌ 27) ఘోర ప్రమాదం జరిగింది. రాత్రిపూట కదులుతున్న ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్యాసింజర్‌ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు ఏడుగురు సజీవదహనమయ్యారు.

కరాచీకి నుంచి లాహోర్‌కు వెళ్తున్న రైలులోని ఏసీ బోగీలో బుధవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో కదులుతున్న రైలు కిటికీలోంచి దూకి ఓ మహిళ చనిపోగా, మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృతి చెందారు. ఆరు మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీలు లేనంతగా కాలిపోయాయి. మంటలు రైలులోని ఇతర బోగీలకు కూడా వ్యాపించడంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. గమనించిన డ్రైవర్‌ వెంటనే టాండో మస్తి ఖాన్‌ స్టేషన్‌లో రైలును ఆపేసి, మంటలు అంటుకున్న బోగీని వేరు చేశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు.

కాగా పాకిస్తాన్‌లోని నిరుపేదలైన ప్రయాణికులు కొందరు వంట గ్యాస్‌ స్టవ్‌లను రైళ్లలో తరలిస్తుంటారు. రైళ్లలో వీటిని తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ.. రద్దీగా ఉండే రైళ్లలో భద్రతా నిబంధనలు అంతగా పట్టించుకోకపోవడంతో పాక్‌లో తరచూ రైళ్లలో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. 2019లో తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో వంట గ్యాస్ స్టవ్ పేలడంతో రైలులో మంటలు చెలరేగి 74 మంది ప్రయాణికులు మరణించగా వందల ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.