లగేజ్‌తో వెళ్తూ కిందపడిపోయిన వ్యక్తి !! ఆ తర్వాత..

లగేజ్‌తో వెళ్తూ కిందపడిపోయిన వ్యక్తి !! ఆ తర్వాత..

Phani CH

|

Updated on: Apr 28, 2023 | 9:27 AM

జపాన్ దేశం అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న దేశమైనప్పటికీ కొత్త కొత్త ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో రోజురోజుకి దూసుకెళ్తుంది. రెండు సార్లు ఆ దేశంపై అణుబాంబులు పడి దేశం మొత్తం ఛిన్నాభిన్నం అయిపోయినా ఏ మాత్రం తగ్గకుండా ముందడుగులు వేసింది.

జపాన్ దేశం అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న దేశమైనప్పటికీ కొత్త కొత్త ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో రోజురోజుకి దూసుకెళ్తుంది. రెండు సార్లు ఆ దేశంపై అణుబాంబులు పడి దేశం మొత్తం ఛిన్నాభిన్నం అయిపోయినా ఏ మాత్రం తగ్గకుండా ముందడుగులు వేసింది. జపాన్ లోని టెక్నాలజీని చూసి ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడుతుంటాయి. అయితే జపాన్ సాంకేతిక రంగంలోనే కాదు అక్కడి ప్రజలు కూడా ఎంతో మానవతాదృక్పథంతో వ్యవహరిస్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ఓ వ్యక్తి తన లగేజ్ తో నడుచుకుంటూ వెళ్తూ అదుపు తప్పి ముందుకి పడిపోయాడు. అలా పడిపోగానే అతని పాకెట్‌లో ఉన్న కరెన్సీ నోట్లు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అది గమనించి అటుగా వెళ్తున్న మిగతా ప్రయాణికులు గబగబా వచ్చి అతన్ని పైకి లేపి, ఆ డబ్బులన్నీ సేకరించి అతనికి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్ ప్రజల మనస్థత్వంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జపాన్‌లోనే కాదు మానవత్వం ఉన్న ఏ మనిషైనా అలాగే స్పందిస్తారు. మానవతకు దేశం, ప్రాంతం, భాషతో పని ఉండదు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండేళ్ల చిన్నారికి అరుదైన గుర్తింపు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో..

సింహం బారినుంచి ఆవులమందను కాపాడిన కుక్క !!

మంచినీళ్లకోసం రైలుదిగాడు.. కట్‌చేస్తే 22 ఏళ్లకు ఇంటికి చేరాడు

20 ఏళ్ల కింద చంపేశా.. కలలోకి వచ్చి హింసిస్తున్నాడు !!

కోడి పిల్లలతో కుక్క స్నేహం.. నెటిజన్ల ప్రశంసలు

 

 

Published on: Apr 28, 2023 09:27 AM