Vizag: ఇంటర్ తప్పి ఏడుస్తుంటే దొంగతనం అంటగట్టి.. దుస్తులు విప్పించి.. చితకబాదిన వైనం

ఏపీలో తాజాగా ఇంటర్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ బాలుడు ఇంటర్‌ ప్రథమ సంవత్సంర తప్పాడు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారేమోనని భయపడి బుధవారం రాత్రి ఇంటి దగ్గర్లో ఉన్న ఓ పాడుబడిన కారులో కూర్చుని ఏడుస్తున్నాడు. ఐతే ఆ కారు స్థానికంగా వైకాపా ఉత్తరాంధ్ర యువజన సంఘం..

Vizag: ఇంటర్ తప్పి ఏడుస్తుంటే దొంగతనం అంటగట్టి.. దుస్తులు విప్పించి.. చితకబాదిన వైనం
Visakhapatnam Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 28, 2023 | 7:28 AM

ఏపీలో తాజాగా ఇంటర్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ బాలుడు ఇంటర్‌ ప్రథమ సంవత్సంర తప్పాడు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారేమోనని భయపడి బుధవారం రాత్రి ఇంటి దగ్గర్లో ఉన్న ఓ పాడుబడిన కారులో కూర్చుని ఏడుస్తున్నాడు. ఐతే ఆ కారు స్థానికంగా వైకాపా ఉత్తరాంధ్ర యువజన సంఘం అధ్యక్షుడిది. వడ్డీ వ్యాపారం చేసే వీరు తమ వద్ద అప్పుతీసుకున్న వ్యక్తి డబ్బు చెల్లించలేదని, అతని కారును జప్తు చేసుకన్నారు. అదే కారులో బాలుడు ఏడుస్తూ కనిపించడంతో కారుదొంగతనం చేయడానికి వచ్చావా అంటూ బాలుడి బట్టలూడదీసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ షాకింగ్‌ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

విశాఖపట్నం అక్కయ్యపాలెం రామకృష్ణనగర్‌కు చెందిన నాగ రవికిరణ్‌ (17) ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యాడు.కుటుంబసభ్యులు ఏమంటారోనన్న భయంతో సమీపంలోని ఓ పాడుపడిన కారులో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. ఐతే సదరు కారు వైకాపా ఉత్తరాంధ్ర యువజన సంఘం అధ్యక్షుడు సునీల్‌, తల్లి సింగాలమ్మలకు చెందినది. కారు దొంగతనానికి వచ్చావా అంటూ సునీల్‌, సింగాలమ్మ బాలుడిని ఇంట్లోకి ఈడ్చుకుని వెళ్లి డాబాపై దుస్తులు విప్పించి నగ్నంగా చితకబాదారు. ఆ తర్వాత వాళ్ల కారు డ్రైవర్‌తోనూ కొట్టించారు. చేతిలో సెల్‌ఫోన్‌ లాక్కొని రాత్రి 9 గంటల నుంచి సుమారు 11గంటల వరకు అక్కడే నిర్బంధించారు.

తర్వాత బాలుడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడని చెప్పడంతో కుటుంబసభ్యులు కంగారుగా అక్కడికి చేరుకున్నారు. వాళ్లు కొట్టిన పిడిగుద్దులకు బాలుడి చెంపభాగం కమిలిపోయి వాపు కనబడటంతో ఇంత దారుణంగా కొడతారా అంటూ బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో వాళ్లు దిక్కున్నచోట చెప్పుకోండంటూ బెదిరించారు. బాదిత బాలుడి తల్లిదండ్రులు బాలుడ్ని తీసుకుని గురువారం ఉదయం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.