KGF Chapter 3: కేజీఎఫ్ 3 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటి రవీనా టాండన్

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్ట్ లు రిలీజ్ అయ్యాయి. కేజీఎఫ్ సినిమా దాదాపు వేయి కోట్లు వరకు వసూల్ చేసింది. కేజీఎఫ్ 2 సినిమా కూడా వేయి కోట్లకు పైగా వసూల్ చేసింది.

KGF Chapter 3: కేజీఎఫ్ 3 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటి రవీనా టాండన్
Kgf 3
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 28, 2023 | 11:42 AM

కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన సినిమాల్లో సంచలనం సృష్టించిన సినిమా కేజీఎఫ్. రాక్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్ట్ లు రిలీజ్ అయ్యాయి. కేజీఎఫ్ సినిమా దాదాపు వేయి కోట్లు వరకు వసూల్ చేసింది. కేజీఎఫ్ 2 సినిమా కూడా వేయి కోట్లకు పైగా వసూల్ చేసింది. గత ఏడాది రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 లో మొదటి పార్ట్ కంటే కొత్త నటీనటులు ఎక్కువ మంది నటించారు. వీరిలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్త, రవీనా టాండన్ ముఖ్యపాత్రలు చేశారు.

ఇదిలా ఉంటే కేజీఎఫ్ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కేజీఎఫ్ 2 చివరిలో ఈ సినిమా పార్ట్ 3 రానుందని హింట్ ఇచ్చారు. తాజాగా కేజీఎఫ్ 3 పై రవీనా టాండన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కే.జి.ఎఫ్ 3 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని అన్నారు రవీనా.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజీఎఫ్ టీమ్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. కె.జి.ఎఫ్ 3 ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా.. మళ్లీ ఆ యూనిట్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని అన్నారు రవీనా టాండన్.