AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bomb Attack: సినీ ఫక్కీలో బీజేపీ నేత దారుణ హత్య.. గతి తప్పిన రాజకీయాలకు పరాకాష్ఠ

తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య కలకలం రేపింది. సినీ ఫక్కీలో ప్రత్యర్ధులు కారుపై నాటు బాంబులతో దాడి చేసి నడిరోడ్డుపై చంపారు. చెన్నైలోని పూందిపలై హైవే నుంచి కాంచీపురం వెళ్ళే చెక్ పోస్ట్‌ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Bomb Attack: సినీ ఫక్కీలో బీజేపీ నేత దారుణ హత్య.. గతి తప్పిన రాజకీయాలకు పరాకాష్ఠ
BJP leader brutally murdered
Srilakshmi C
|

Updated on: Apr 28, 2023 | 9:37 AM

Share

తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య కలకలం రేపింది. సినీ ఫక్కీలో ప్రత్యర్ధులు కారుపై నాటు బాంబులతో దాడి చేసి నడిరోడ్డుపై చంపారు. చెన్నైలోని పూందిపలై హైవే నుంచి కాంచీపురం వెళ్ళే చెక్ పోస్ట్‌ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చెన్నైలోని శ్రీపెరంబుదూరు పక్కనున్న వరకపురం పంచాయతీ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా, బీజేపీ ఎస్సీ ఎస్టీ విభాగం రాష్ట్ర కోశాధికారిగా పీబీజీ శంకర్ పనిచేస్తున్నారు. గురువారం రాత్రి శంకర్‌ చెన్నై నుంచి కారులో బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పూనమలీ సమీపంలోని నజరత్‌పేట జంక్షన్‌ వద్దకు కారు రాగానే ఓ ముఠా కారుపై నాటు బాంబు విసిరింది. ధ్వంసమైన కారు కొద్ది దూరంలో ఆగింది. దీంతో కారు దిగి రోడ్డుపై పరుగెత్తుకుంటూ వెళుతోన్న బీజేపీ నేత శంకర్‌ను ఆ ముఠా వెంబడించి నరికి చంపింది.

రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో సినిమా తరహాలో హత్య జరగడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. నజరత్‌పేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్య చేసిన ముఠా ఎవరనే కోణంలో విచారణ కొనసాగుతోంది. హత్యకు ఎన్నికల సమయంలో జరిగిన గోడవలే కారణమా లేక రియల్ ఎస్టేటు సంబంధిత గొడవలేమైనా కారణమా అనే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.