Axis Bank Q4 results: నష్టాల్లోకి యాక్సిస్ బ్యాంక్.. గతేడాది సిటీబ్యాంక్ కొనుగోలు చేసి ‘తప్పు’లో కాలేసిన వైనం
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజాల్లో ఒకటైనా యాక్సిస్ బ్యాంక్ నష్టాలలోకి ప్రవేశించింది. యాక్సిస్ బ్యాంక్ జనవరి-మార్చి 2023 (క్యూ4) త్రైమాసికానికి దాదాపు రూ.5728.42 కోట్ల నికర నష్టం నమోదైనట్లు గురువారం ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో (2021– 2022) రూ.4,118 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం..
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజాల్లో ఒకటైనా యాక్సిస్ బ్యాంక్ నష్టాలలోకి ప్రవేశించింది. జనవరి-మార్చి 2023 (క్యూ4) త్రైమాసికానికి దాదాపు రూ.5728.42 కోట్ల నికర నష్టం నమోదైనట్లు యాక్సిస్ బ్యాంక్ గురువారం ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో (2021– 2022) రూ.4,118 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.22,000 కోట్ల నుంచి రూ.28,865 కోట్లకు ఎగబాకింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 17,776 కోట్ల నుంచి రూ.23,970 కోట్లకు బలపడింది.
మార్చి 31, 2023తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.1 డివిడెండ్ లేదా రూ.2 ఫేస్ వ్యాల్యూలో 50 శాతం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో రూ. 5,361 కోట్ల నికర నష్టం నమోదైంది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,417 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAలు) మార్చి 2022 చివరి నాటికి 2.82 శాతం ఉండగా అది మార్చి 31, 2023 నాటికి 2.02 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు కూడా 0.73 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గాయి. క్యూ4లో మొండి బకాయిల (ఎన్‌పీఏలు) విషయానికొస్తే ఏడాది క్రితం రూ.987 కోట్ల నుంచి తగ్గి రూ.306 కోట్లకు పరిమితమైంది.
కాగా యాక్సిస్ బ్యాంక్ మార్చి 1న సిటీ బ్యాంక్ కన్‌జ్యూమర్ బిజినెస్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) కన్‌జ్యూమర్ బిజినెస్‌లను రూ.11,603 కోట్లతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్టాలు నమోదయ్యాయని, నికర లాభం 61 శాతం వృద్ధి సాధించినట్లు బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరీ చెప్పారు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసే నాల్గవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా కొనసాగుతోంది. దాదాపు మొత్తం 8.6 మిలియన్ క్రెడిట్ కార్డుదారుల్లో యాక్సిస్ బ్యాంక్ సుమారు 2.5 మిలియన్ల క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లను కలిగి ఉంది. దీంతో టాప్ 3 కార్డు బిజినెస్‌లలో ఒకటిగా రికార్డు సాధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.