Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Scheme: రోజుకు రూ. 333 పెట్టుబడితో రూ. 16లక్షలు రాబడి వచ్చే బెస్ట్ స్కీమ్.. వివరాలివి..

కష్టపడి సంపాదించిన డబ్బుకు మంచి రాబడితో అందించే సురక్షితమైన మార్గంగా పోస్ట్‌ ఆఫీసు పథకాలను వినియోగదారులు చూస్తారు. అటువంటి పథకాలలో పోస్ట్‌ ఆఫీసు రికరింగ్‌ డిపాజిట్‌(ఆర్‌డీ) ఒకటి. దీనిలో సాధారణ బ్యాంకులలో లభించే పిక్స్‌డ్‌ డిపాజిట్‌, రికరింగ్‌ డిపాజిట్‌ లకన్నా అధికంగా వడ్డీ వస్తుంది.

Post Office Scheme: రోజుకు రూ. 333 పెట్టుబడితో రూ. 16లక్షలు రాబడి వచ్చే బెస్ట్ స్కీమ్.. వివరాలివి..
Post Office Scheme
Follow us
Madhu

|

Updated on: Apr 28, 2023 | 11:00 AM

మన దేశంలోని మధ్య తరగతి ప్రజలు పోస్టు ఆఫీసుల్లో నగదు దాచుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు. బ్యాంకుల్లో ఎన్ని రకాల స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నా ఎక్కువగా పోస్ట్‌ ఆఫీసుల వైపే చూస్తారు. దీనికి ప్రధాన కారణం అధిక వడ్డీతోపాటు ప్రభుత్వ భరోసా ఉండటమే. కష్టపడి సంపాదించిన డబ్బుకు మంచి రాబడితో అందించే సురక్షితమైన మార్గంగా పోస్ట్‌ ఆఫీసు పథకాలను వినియోగదారులు చూస్తారు. అటువంటి పథకాలలో పోస్ట్‌ ఆఫీసు రికరింగ్‌ డిపాజిట్‌(ఆర్‌డీ) ఒకటి. దీనిలో సాధారణ బ్యాంకులలో లభించే పిక్స్‌డ్‌ డిపాజిట్‌, రికరింగ్‌ డిపాజిట్‌ లకన్నా అధికంగా వడ్డీ వస్తుంది. క్రమం తప్పకుండా దీనిలో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుంది. పోస్ట్‌ ఆఫీసులో రికరింగ్‌ డిపాజిట్‌ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరు అర్హులు..

పోస్ట్‌ ఆఫీసుల్లో రికరింగ్‌ డిపాజిట్‌(ఆర్‌డీ) ఖాతా ప్రారంభించడానికి 10 ఏళ్ల నిండిన భారతీయ పౌరుడు ఎవరైనా అర్హులే. డిపాజిటర్లు కనీసం రూ. 100తో ఖాతా ప్రారంభించవచ్చు. రూ. 10 గుణిజాలలో ఎంతైన పెట్టుబడి పెట్టొచ్చు. దీనిపై 5.8శాతం వడ్డీని పోస్ట్‌ ఆఫీసు అందిస్తుంది. ప్రతి త్రైమాసికానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమచేస్తుంది. క్రమం తప్పకుండా దీనిలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో అసలు, వడ్డీపై పూర్తి భద్రత ఉంటుంది. దీనిలో రిస్క్‌ ఫ్యాక్టర్‌ అసలు ఉండదు.

కాల వ్యవధి ఇలా..

పోస్ట్‌ఆఫీసుల్లో రికరింగ్‌ డిపాజిట్‌ ఓపెన్‌ చేసిన రోజు నుంచి కనీసం ఐదేళ్లు లేదా 60 నెలల తర్వాత ఏది ముందుగా వస్తే దానిని గరిష్ట టెన్యూర్‌గా నిర్ణయిస్తారు. అయితే డిపాజిటర్లు కాతా తెరచిన ఏడాది తర్వాత తమ మొత్తం నుంచి 50 శాతం విత్‌ డ్రా చేసుకొనే అవకాశం ఇందులో ఉంటుంది. రుణం కింద 50 శాతం మొత్తాన్ని తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రూ. 16 లక్షలు సంపాదించడం ఇలా..

ప్రస్తుతం పోస్ట్‌ ఆఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌పై ఉన్న 5.8 శాతం వడ్డీ రేటు ప్రకారం, పెట్టుబడిదారుడు ప్రతి నెలా రూ. 10,000 లేదా ప్రతిరోజూ దాదాపు రూ. 333 పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు రూ. 16 లక్షల రాబడిని పొందవచ్చు. మొత్తం డిపాజిట్ రూ. పదేళ్లకు 12 లక్షలు, వడ్డీ అంచనా రూ. 4. 26 లక్షలు, మొత్తం రాబడి రూ. 16. 26 లక్షలు అవుతుంది. ప్రతి మూడు నెలలకు, చక్రవడ్డీ లెక్కించబడుతుంది, ఇది పెట్టుబడిదారులకు సాధారణ రాబడిని అందిస్తుంది.

పూర్తి సురక్షితం..

పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టగలిగినా, సురక్షితంగా ఉంటుంది. పైగా మీ భవిష్యత్తు అవసరాలను తీర్చడంలో బాగా ఉపయోగపడుతుంది.కచ్చితమైన రాబడికి ప్రభుత్వ భరోసా కూడా ఉంటుంది కాబట్టి తమ నగదును దాచుకోవాలనుకునే వారికి ఇది చాలా మంది ఎంపిక.

 మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..