- Telugu News Photo Gallery Nita Ambani's Personal Makeup Artist is Mickey Contractor, know How Much He money charges Per Person
నీతా అంబానీ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ శాలరీ ఎంతో తెలుసా? అపర కుబేరుల ఫ్యామిలీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..
0 ఏళ్ల వయసులోనూ నీతా అంబానీ ఎంతో అందంగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి వేడుకలు, పార్టీలు, ఫంక్షన్లలోనూ ఎంతో అందంగా ముస్తాబై కనిపిస్తుంటారు. అదే సమయంలో సంప్రదాయాలకు ప్రాధాన్యత నిస్తూ ఎక్కువగా చీరల్లోనే దర్శనమిస్తుంటారు.
Updated on: Apr 28, 2023 | 1:49 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన లైఫ్‌స్టైల్‌తో పలు సార్లు వార్తల్లో నిలిచారు.

ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో ముత్యాలు, ఇతర రత్నాలు పొదిగిన ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీరను ధరించి వార్తల్లో నిలిచారామె. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.

60 ఏళ్ల వయసులోనూ నీతా అంబానీ ఎంతో అందంగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి వేడుకలు, పార్టీలు, ఫంక్షన్లలోనూ ఎంతో అందంగా ముస్తాబై కనిపిస్తుంటారు. అదే సమయంలో సంప్రదాయాలకు ప్రాధాన్యత నిస్తూ ఎక్కువగా చీరల్లోనే దర్శనమిస్తుంటారు.

కాగా నీతా అంబానీ అందంగా కనిపించడం వెనక ఆమె పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ నైపుణ్యం ఎంతో ఉంది. ఆయన మరెవరో కాదు సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్.

కరీనా కపూర్, దీపికా పదుకొణె, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అనుష్కా శర్మ, అలియాభట్ .. ఇలా బాలీవుడ్‌లో ఫేమస్ సెలబ్రిటీలకు ఈయనే పర్సనల్ మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తున్నారు.

దేశంలోనే అత్యంత ఖరీదైన మేకప్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన మిక్కీ ఒక్కో ఈవెంట్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 75 వేల నుండి లక్ష రూపాయలు తీసుకుంటారట.




