Heritage City: 100 అడుగుల కృష్ణుడి విగ్రహం, కొత్త బృందావనం ఎలా ఉంటుందో తెలుసా?

ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశ 2024  నుంచి 2027 మధ్య ఉంటుందని అరుణ్ వీర్ సింగ్ చెప్పారు. ఇది రివర్ ఫ్రంట్ చుట్టూ 445 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. దేవాలయ సముదాయం, సాంస్కృతిక కార్యక్రమాలపై గ్రామం దృష్టి సారిస్తుంది.

Heritage City: 100 అడుగుల కృష్ణుడి విగ్రహం, కొత్త బృందావనం ఎలా ఉంటుందో తెలుసా?
Heritage City
Follow us
Surya Kala

|

Updated on: Apr 28, 2023 | 10:39 AM

ఢిల్లీలోని ప్రసిద్ధ అక్షరధామ్ దేవాలయం తరహాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మధుర-బృందావన్ సమీపంలో వారసత్వ నగరాన్ని నిర్మించబోతున్నారు. అక్షరధామ్ ఆలయం తరహాలో ఈ నగరంలో ఆలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయం ప్రాంగణంలో 100 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఢిల్లీలోని హై-స్ట్రీట్ మార్కెట్, ఉదయపూర్‌లోని శిల్ప గ్రామం వంటి గ్రామం ఈ వారసత్వ నగరంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నగరం ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను తెలియజేసే విధంగా నిర్మించనున్నారు.

హెరిటేజ్ సిటీలో ఆలయం, 100 అడుగుల కృష్ణుడి విగ్రహం టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ ప్రతిపాదిత వారసత్వ నగరానికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధంగా ఉంది. త్వరలో ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీకి పంపబడుతుంది. 2034 నాటికి మూడు దశల్లో 750 ఎకరాల్లో ఈ సిటీని నిర్మిస్తామని అధికార అధికారులు తెలిపారు. కృష్ణ దేవాలయం, 100 అడుగుల ఎత్తైన కన్నయ్య విగ్రహం, మార్కెట్ ‘హెరిటేజ్ సిటీలో’ ని నిర్మిస్తామని చెప్పారు.

హెరిటేజ్ సిటీలో సాంస్కృతిక ప్రాంతం  ఈ వారసత్వ నగరంలో గురుగ్రామ్, లండన్‌లోని కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్ తరహాలో O-2 ఎరీనాను రూపొందించాలని ఆలోచిస్తున్నారు. అంతేకాదు ఈ హెరిటేజ్ సిటీలో ఇంటరాక్టివ్ కల్చరల్ ఏరియా ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఇది ఆధ్యాత్మిక-సాంస్కృతిక సముదాయం అవుతుంది. ఇందులో శ్రీకృష్ణుని జీవితంలోని ముఖ్య ఘట్టాలు ప్రదర్శిస్తారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా 100 అడుగుల విగ్రహం నిలుస్తుంది.  ఈ సిటీలో హిందూ సంస్కృతి, సాంప్రదయాలను తెలిపే ఇతర ముఖ్యమైన విషయాలతోపాటు, కృష్ణుడి బోధనలను చెప్పే ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ హెరిటేజ్ సిటీలో నిర్మించబడే ఇంటరాక్టివ్ కల్చర్ సెంటర్‌లో ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం తరహాలో స్లైడ్, సౌండ్ షోలు ఉంటాయి. మ్యూజియంలో ఆటోమేటెడ్ బోట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ అరుణ్ వీర్ సింగ్ హెరిటేజ్ సిటీ నిర్మాణంపై స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి వెల్లడించారు.

ఢిల్లీ హార్ట్ తరహాలో ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మార్కెట్ తెరవబడుతుంది. హెరిటేజ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా హిందువుల పండుగలను నిర్వహించడానికి యాంఫిథియేటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

మూడు దశల్లో ప్రాజెక్టు పనులు  ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశ 2024  నుంచి 2027 మధ్య ఉంటుందని అరుణ్ వీర్ సింగ్ చెప్పారు. ఇది రివర్ ఫ్రంట్ చుట్టూ 445 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. దేవాలయ సముదాయం, సాంస్కృతిక కార్యక్రమాలపై గ్రామం దృష్టి సారిస్తుంది. ఈ ప్రాజెక్ట్ రెండవ దశ 2028-31 మధ్య అభివృద్ధి చేయనున్నారు. ఈ సమయంలో హాస్పిటాలిటీ రంగం విస్తరణపై దృష్టి సారించనున్నారు.  ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎక్కువసేపు ఉండేందుకు.. పెద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుంటుంది. రెండో దశలో 182 ఎకరాలను అభివృద్ధి చేయనున్నారు.

మూడవ దశ 2032 నుంచి 2034 మధ్య ఉంటుంది. ఇందులో 126 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. ఈ సమయంలో వేద శాస్త్రం, కళల ప్రదర్శన, యోగా, ఆయుర్వేదం వంటి వాటిల్లో  కోర్సులను అందించే ప్రత్యేక సంస్థలపై దృష్టి పెట్టనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ నుండి జైపూర్‌కు ప్రయాణ సమయాన్ని 5 గంటల నుండి దాదాపు 3.5 గంటలకు తగ్గిస్తుంది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే 1,386 కి.మీ పొడవుతో భారతదేశపు అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..