AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zero Shadow Day: నేడు గ్రీన్ సిటీలో కొన్ని క్షణాలు నీడలు మాయం.. ఈ విచిత్రం వెనుక రీజన్ ఏమిటో తెలుసా..

నేడు నగరంలోని నిలువు వస్తువులు కొంత కాలం పాటు నీడలను కలిగి ఉండవు.  దీనిని శాస్త్రవేత్తలు జీరో షాడో డే అని పిలుస్తారు. బెంగళూరులోని కోరమంగళలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఈ సందర్భంగా తన క్యాంపస్‌లో ఈవెంట్‌లను నిర్వహించనుంది.

Zero Shadow Day: నేడు గ్రీన్ సిటీలో కొన్ని క్షణాలు నీడలు మాయం.. ఈ విచిత్రం వెనుక రీజన్ ఏమిటో తెలుసా..
Zero Shadow Day In Bengalur
Surya Kala
|

Updated on: Apr 25, 2023 | 10:16 AM

Share

నీడ వెళుతున్న సమయంలో కనిపిస్తుంది. అది వస్తువులకైనా, మనుషులకైనా నీడ వెంట ఉండడం తప్పనిసరి. అయితే ఈ రోజు మనదేశంలో ఓ నగరంలో నీడలు మాయం కానున్నాయి. గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా గా ప్రసిధ్దగాంచిన బెంగుళూరు ఈ వింతకు వేదికగా మారనుంది. జీరో షాడో డే గా పిలిచే ఈ వింత బెంగళూరులో కొద్దిసేవు అరుదైన ఖగోళ దృగ్విషయం ఆవిష్కృతం కానుంది. ఈ ఘటన మధ్యాహ్నం 12.17 గంటలకు జరగనుంది. నేడు నగరంలోని నిలువు వస్తువులు కొంత కాలం పాటు నీడలను కలిగి ఉండవు.  దీనిని శాస్త్రవేత్తలు జీరో షాడో డే అని పిలుస్తారు. బెంగళూరులోని కోరమంగళలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఈ సందర్భంగా తన క్యాంపస్‌లో ఈవెంట్‌లను నిర్వహించనుంది.

జీరో షాడో డే అంటే ఏమిటంటే? 

ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. సూర్యుడు స్వల్ప వ్యవధిలో నేరుగా తలపైకి చేరుకుంటాడు.  దీనివలన మధ్యాహ్నం భూమిపై ఏ వస్తువు నీడ కనిపించదు.

ASI శాస్రవేత్తలు మాట్లాడుతూ..కర్కాటక రాశి , మకర రాశి మధ్య ప్రదేశాలలో స్థానిక మధ్యాహ్న సమయంలో ఏదైనా నిలువు వస్తువు నీడను ప్రసరింపజేయదు. ఇలా ఏడాదికి రెండు సార్లు జరుగుంది. దీనిని జీరో షాడో డే అని అంటారు. బెంగళూరులో  ఈ దృగ్విషయం ఈ రోజు.. మళ్ళీ ఆగస్టు 18 తేదీలలో జరుగుతుంది. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు, ఉత్తరాయణం, దక్షిణాయనం రెండింటిలోనూ సూర్యుని క్షీణత ఆ ప్రాంతాల అక్షాంశానికి సమానంగా ఉంటుంది. అందుకే సూర్యుడు నడి నెత్తిన నిటారుగా కనిపిస్తాడట. ఈ సమయంలో నిలువు వస్తువుల నీడలు మాయం అయ్యే  వింత చోటుచేసుకోనుంది.

దీనికి రీజన్ జరుగుతుందంటే? 

భూభ్రమణ అక్షం సూర్యుని చుట్టూ తిరిగే సమతలానికి 23.5 డిగ్రీల వంపులో ఉంటుందని.. ఇలా జరగడం వలన రుతువులు ఏర్పడతాయాని ASI తెలిపింది. అంటే సూర్యుడు రోజులో అత్యంత ఎత్తైన ప్రదేశంలో, ఖగోళ భూమధ్యరేఖకు దక్షిణంగా 23.5 డిగ్రీల నుంచి భూమధ్యరేఖకు (ఉత్తరాయణ) ఉత్తరాన 23.5 డిగ్రీలకు, ఒక సంవత్సరంలో తిరిగి (దక్షిణాయన) కదులుతాయని చెప్పారు. దీంతో ఒకసారి ఉత్తరాయణ సమయంలో .. మరొకటి దక్షిణాయనం సమయంలో ఈ జీరో షాడో ఏర్పడుతుంది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ రోజు మధ్యాహ్నం అనేక కార్యకలాపాలు, పబ్లిక్ సెమినార్‌ను నిర్వహించనుంది. సామాన్య ప్రజలు IIA క్యాంపస్‌కు చేరుకుని ఈ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. ఇందులో నీడ, దాని కదలికలకు సంబంధించి అనేక ప్రదర్శనలు ఉంటాయి. సాధారణంగా, ప్రతి సంవత్సరం, ఖగోళ ఔత్సాహికులు ఒకచోట చేరి, సర్కిల్‌లలో నిలబడి వారి నీడలను చూస్తారు. ఒక బాటిల్ వాటర్, PVC పైపులు, గరిటెలు ,యు రంధ్రాలతో కూడిన కాగితం నేల మధ్యలో ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు సరిగ్గా మధ్యాహ్నం 12.17 గంటలకు నీడలు అదృశ్యం కావడం,  నెమ్మదిగా కదుపుతూ మళ్లీ కనిపించడం గమనించవచ్చు.

IIAలోని శాస్త్రవేత్తలు మంగళవారం ఒక పాఠశాల సహకారంతో భూమి యొక్క వ్యాసాన్ని కొలుస్తారు, అధికారులు మీడియాకు తెలిపారు. జీరో షాడో డే వ్యవధి అనే వింత సెకనులో కొంత భాగం మాత్రమే ఉంటుంది. మొత్తం ఒకటిన్నర నిమిషాల వరకు కనిపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..