Bournvita Row: బోర్న్‌విటాకు నోటీసులు.. యాడ్స్ ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయంటూ..
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బోర్న్‌విటార్ తయారీదారు మోండెలెజ్ ఇండియా ఇంటర్నేషనల్‌కు నోటీసు పంపింది. బోర్నవిటా ప్యాకేజ్, లేబులింగ్, ప్రకటనలు కస్టమర్స్ ను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ ప్రకటనలను పునఃపరిశీలించాలని, తప్పుదారి పట్టించే ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ కంపెనీకి నోటీసు జారీ చేసింది.
తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని.. శారీరకంగా దృఢంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. అందుకోసం తమ పిల్లలకు మార్కెట్ లో దొరికే రకరకాల హెల్త్ డ్రింక్స్‌ను ఇస్తారు. అయితే పిల్లలకు మీరు ఆరోగ్యం కోసం ఇస్తున్న ఈ హెల్త్ డ్రింక్ లో ఏముందో అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఇటీవల ఒక యూట్యూబర్ ఫేమస్ హెల్త్ డ్రింక్ బోర్న్‌విటాను తయారు చేస్తున్న పదార్థాలు, వాటి నాణ్యతను ప్రశ్నించారు.
తాజాగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బోర్న్‌విటార్ తయారీదారు మోండెలెజ్ ఇండియా ఇంటర్నేషనల్‌కు నోటీసు పంపింది. బోర్నవిటా ప్యాకేజ్, లేబులింగ్, ప్రకటనలు కస్టమర్స్ ను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ ప్రకటనలను పునఃపరిశీలించాలని, తప్పుదారి పట్టించే ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ కంపెనీకి నోటీసు జారీ చేసింది. బోర్న్‌విటాలో చక్కెర అధికంగా ఉండటంపై ఇటీవల వివాదం చెలరేగడంతో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నోటీసు పంపింది.
బోర్నవిటాలో అధిక శాతం చక్కెర, క్యాన్సర్‌కు కారణమయ్యే రంగులు, పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర పదార్థాలు ఉన్నాయన్నది ఆ కంపెనీపై వచ్చిన ఆరోపణలు కమిషన్ దృష్టికి వచ్చిందని, పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే అనేక పదార్థాలు లేదా ఫార్ములాలను కలిగి ఉంది,” అని మోండెలెజ్ కంపెనీ ప్రెసిడెంట్ దీపక్ అయ్యర్‌కు పంపిన నోటీసులో తెలిపారు.
తయారీదారులకు నోటీసులు పంపడంతో పాటు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ బోర్న్‌విటా తయారీదారులపై తప్పుదారి పట్టించే ప్రకటనలు, ఆహార భద్రత మార్గదర్శకాలను అనుసరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని అభ్యర్థించింది.
దీంతో, బోర్నవిటా కంపెనీకి NCPCR నోటీసు ఇచ్చింది. అయితే.. మోండెలెజ్ ఇంటర్నేషనల్ ఇండియా కంపెనీకి లీగల్ నోటీసు అందిన తర్వాత, ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన వీడియోను తొలగించాడు. అప్పటికే ఆ వీడియోను 1.2 కోట్ల మంది చూసినట్లు నమోదైంది.
ఇటీవల ఒక యూట్యూబర్ బోర్న్‌విటాలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉందని, కోకో ఘన పదార్థాలు, క్యాన్సర్‌కు కారణమయ్యే రంగులు ఉన్నాయని ఆరోపిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది.
ఈ వీడియోపై బోర్న్‌విటా తయారీదారు స్పందిస్తూ.. అతని వాదన తప్పు అని, యూట్యూబర్‌కు లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత ఆ వీడియోను డిలీట్ చేశాడు. అయితే అప్పటికే ఆ వీడియోను 1.2 కోట్ల మంది చూసినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..